Home /News /trending /

US WOMAN STEPHANIE MATTO WHO MADE RS 38 LAKH A WEEK SELLING HER FARTS ONLINE HOSPITALISED HERE IS INTERESTING DETAILS SK

Farting Star: పిత్తులను అమ్ముతూ కోట్ల సంపాదన.. కానీ చివరకు ఆ గ్యాసే కొంప ముంచింది..

స్టీఫెనీ మ్యాటో

స్టీఫెనీ మ్యాటో

Farting Star Retirement: వారానికి 50 సీసాల మేర అపాన వాయువును అమ్మేది స్టీఫెనీ మాటో. ఒక్కో జార్‌ను వెయ్యి డాలర్లు (రూ.74వేలు)కు విక్రయించేది. ఈ పిత్తుల వ్యాపారంతో ఆమె కోట్ల రూపాయలను కూడబెట్టింది.

  అపాన వాయువును వదలాలంటే మనో చాలా మంది ఇబ్బంది పడతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మొహమాటపడతారు. కానీ ఓ మహిళ ఇవే పిత్తులతో కోట్లు సంపాదిస్తోంది. అలా ఇప్పటి వరకు బాగానే కూడబెట్టింది. కానీ ఆ పిత్తులే ఇప్పుడు ఆమెకు ప్రాణాల మీదకు తెచ్చాయి. గుండెపోటు రావడంతో ఆస్పత్రి పాలయింది. శరీరంలో గ్యాస్ నిండిపోయిందని.. ఆ కారణంగానే అస్వస్థతకు గురయిందని డాక్టర్లు చెప్పారు. గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించడంతో.. ఇక ఆ పిత్తుల వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

  Viral News: ఈ మహిళా జడ్జి నిజంగానే నేరస్థుడిని ముద్దాడిందా ?.. అక్కడ ఇదే చర్చ.. ఫోటో వైరల్

  డైలీ మెయిల్ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన 31 ఏళ్ల స్టీఫెనీ మాటో ఒక యూట్యూబర్. రియాలిటీ టీవీ స్టార్‌గా కూడా సుపరిచతం. అయితే ఈమె తన పిత్తులను గాజు సీసాల్లో బంధించి అమ్ముతోంది. విభిన్న వాసనలతో కూడిన జార్‌లను కొనేందుకు జనాలు కూడా ఎగబడుతున్నారు. అలా పిత్తులను అమ్ముతూ ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల డాలర్లు.. అంటే మన కరెన్సీలో 1.4 కోట్లు సంపాదించింది. గ్యాస్ ఎక్కువగా వచ్చేందుకు స్టీఫెనీ మాటో ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అయ్యేది. గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ఆహారాన్నే తీసుకునేది. బీన్స్, అరటి పళ్లు, గుడ్లు,ప్రొటీన్ షేక్స్ తీసుకుంటూ పిత్తులను వదిలేది. ఒక్కోసారి రోజుకు ఒక పెద్ద గిన్నె నిండా బీన్స్ సూప్‌ను తాగేది. చిక్కుళ్లను ఎడా పెడా లాగించేది.

  Sindhutai Sapkal: రైళ్లలో బిచ్చమెత్తిన ఆమె.. అభాగ్యులకు అమ్మయింది..

  వారానికి 50 సీసాల మేర అపాన వాయువును అమ్మేది స్టీఫెనీ మాటో. ఒక్కో జార్‌ను వెయ్యి డాలర్లు (రూ.74వేలు)కు విక్రయించేది. ఈ పిత్తుల వ్యాపారంతో ఆమె కోట్ల రూపాయలను కూడబెట్టింది.

  Protest: వినూత్నంగా తేనెతుట్టెలతో నిరసన తెలిపారు.. ముగింపు ఇలా ఉంటుందని ఊహించలేకపోయారు.

  అడల్ట్ వెబ్‌సైట్ అన్‌ఫిల్టర్ట్‌లో పిత్తులకు ఉన్న డిమాండ్‌ను చూసి 2021లో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టింది స్టీఫెనీ మాటో. మొదట్లో తక్కువ ధరకే విక్రయించేది. కానీ ఆ తర్వాత తన పిత్తులకు డిమాండ్ పెరగడంతో రేటు పెంచేసింది. ఈమె పిత్తులకు కొందరు ఫిదా అయితే.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి? ఇలాంటి బిజినెస్ కూడా చేస్తారా? అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. కొందరైతే చంపేస్తామని బెదిరించారు. కానీ ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.

  మాస్కులు పెట్టుకోకపోతే మీకే నష్టం..పబ్లిక్‌కి అవగాహన కల్పించిన సీఎం

  ఐతే ఇటీవల ఆమెకు గుండెల్లో మంటగా అనిపించింది. ఊపిరాడలేదు. హార్ట్ ఎటాక్‌లా అనిపించడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను కలిసింది మ్యాటో. పరీక్షలు చేసిన వైద్యులు.. భవిష్యత్‌లో గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇలాగే నిర్లక్ష్యగా ఉంటే ప్రాణాలు పోవచ్చని హెచ్చరించారట. మీ శరీరంలో పేరుకుపోయిన గ్యాస్ వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పాటర. అంతే.. డాక్టర్ల హెచ్చరికలతో మాటీ ఖంగుతింది. పిత్తుల కోసమే సెపరేట్ డైట్ ఫాలో అవుతూ గ్యాస్‌ను పెంచుకుంది. కానీ ఇప్పుడతే గ్యాస్ తన ప్రాణాల మీదకు తేవడంతో... పిత్తుల వ్యాపారానికి రిటైర్మెంట్ ప్రకటించింది స్టీఫెనీ మాటో. ఇక నుంచి మంచి ఆహారం తీసుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని చెప్పింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: International, International news, Trending, Trending news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు