మనం సాధారణంగా రకరకాల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తుంటాం. అక్కడ బాధితులకు ఉన్న సమస్యలను తెలుసుకొవడానికి ల్యాబ్ లలో రకరకాల టెస్ట్ లు చేస్తుంటారు. బ్లెడ్ టెస్ట్, యూరిన్, షుగర్, రకరకాల టెస్ట్ లు చేస్తుంటారు. వీటికి ఆస్పత్రులలో ప్రత్యేక మైన ప్రైస్ లు ఉంటాయి. వీటిని ఆస్పత్రులను బట్టి టెస్ట్ ప్రైస్ లలో వ్యత్యాసం కూడా ఉంటుంది. ఇవన్ని మనకు తెలిసిందే. ఆస్పత్రిలో అన్ని రకాల చికిత్సలు చేసి, రోగి కోలుకున్నాక... సిబ్బంది మనకు బిల్లులు వేసి ఇస్తుంటారు. అయితే, ఇక్కడ ఒక ఆస్పత్రి కాస్త వెరైటీగా పనిచేసింది. ప్రస్తుతం ఈ సంఘటన కాస్త వైరల్ గా (Viral news) మారింది.
My little sister has been really struggling with a health condition lately and finally got to see a doctor. They charged her $40 for crying. pic.twitter.com/fbvOWDzBQM
పూర్తి వివరాలు.. యూఎస్ కు (United states) చెందిన ఫెమస్ యూట్యూబర్ కామిల్లె జాన్సన్, తన సోదరికి ఎదురైన ఒక షాకింగ్ ఘటనను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. కాగా, ఆమె సోదరి కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలు, డిప్రెషన్ తో బాధపడుతుంది.ఈ క్రమంలో ఒక ఆస్పత్రిలో రెగ్యులర్ గా వెళ్ళి చూయించుకుంటుంది. ఆమె డాక్టర్ విజిట్ (Doctor visit) సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైంది. దీంతో ఒక్కసారిగా గుక్కపెట్టి (Woman cried) ఏడ్చింది. దీంతో ఆ తర్వాత ఆమెను పక్కకు తీసుకెళ్లారు.
అయితే, ట్రీట్ మెంట్ అయిపోయాక.. ఆమెకు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు అందించిన సర్వీస్ కు గాను బిల్ వేశారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె డాక్టర్ విజిట్ సమయంలో ఏడ్చినందుకు 40 డాలర్లు స్పెషల్ బిల్ వేశారు. అంటే.. 3,100 రూపాయలు అన్నమాట. దీంతో ఆమె షాకింగ్ కు గురయ్యారు. ఆ తర్వాత.. ఈ ఘటనను కామిల్లే జాన్సన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఒక శునకం అమ్మాయి పట్ల ఫన్నీగా ప్రవర్తించింది.
ఒక అమ్మాయి తెలుపు రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంటు వేసుకుని ఇంటి ముందర కూర్చోని ఉంది. ఏదో విషయం గురించి డీప్ గా ఆలోచిస్తున్నట్టుంది. ఇంతలో ఆ వీధిలో కొన్ని శునకాలు వచ్చాయి. సాధారణంగా కుక్కలు ఆటోలు,కార్లు, గోడల మీద మూత్ర విసర్జన చేస్తుంటాయి. అయితే, ఈ శునకం మాత్రం కాస్త వింతగా ప్రవర్తించింది. అక్కడ దగ్గర్లో దానికి అనుకూలంగా ఏం కన్పించలేదో కానీ..మెల్లగా కింద కూర్చోని ఉన్న అమ్మాయి దగ్గరకు వెనక నుంచి వెళ్లింది.
యువతి కుక్కను గమనించలేదు. అది మెల్లగా వెళ్లి కాలు పైకెత్తి మూత్ర విసర్జన చేసింది. పాపం.. అమ్మాయికి ఏదో తడిగా అన్పిస్తే.. వెనుక వైపు చూసింది. ఆ తర్వాత.. షాక్ కు గురైంది. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు అమ్మాయిని కుక్క.. ఆ రకంగా బ్లేస్సింగ్స్ ఇచ్చిందంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.