US VICE PRESIDENT KAMALA HARRIS TESTS POSITIVE FOR COVID WHITE HOUSE INFORMS PAH
Covid: అదనపు బూస్టర్ డోసు వేసుకున్న వదల్లేదు.. కరోనా బారిన పడిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్..
కమలా హ్యారిస్ (ఫైల్)
Corona virus: కరోనా మహామ్మారి ప్రపంచ దేశాలను మరోసారి కలవర పెడుతుంది. తాజాగా, పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కరోనా బారినపడ్డారు.
US Vice President Kamala Harris Tests Positive for Covid: కరోనా పలు దేశాల్లో మరోసారి విరుచుకుపడుతుంది. ఇప్పటికే చైనా, అమెరికా దేశాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చైనాలోని షాంఘైలో కఠిన ఆంక్షలను పాటిస్తున్నారు. కరోనా రోజుకో వేరియంట్ రూపంలో పలు దేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇక ఈ మహామ్మారి.. (Corona virus) సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని విడిచి పెట్టడం లేదు. ఇటు దేశాధినేతలు, మంత్రులు, రాయబారులు, విదేశాంగ మంత్రులు,సెలబ్రేటీలు అంతా.. కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కరోనా బారిన పడ్డారు.
పూర్తి వివరాలు.. అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ( Kamala Harris ) కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు కొన్ని రోజులుగా పలు ఆరోగ్య సమస్యలు ఉంటే.. టెస్ట్ చేయించుకుంటే. కరోనా అని తెలిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కమలా హ్యారిస్ తొలి రెండు డోసులతో పాటు, బూస్టర్ డోస్ ను (covid booster dose) కూడా వేసుకున్నారు. ఇక దీనితో పాటు.. అదనపు బూస్టర్ డోస్ వేయించుకున్న ఈ మహామ్మారి వదల్లేదు. కాగా,ప్రస్తుతం వైద్యుల సూచనమేరకు ఐసోలేషన్ లో ఉన్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.
ఇక యూఎస్ (United states) లో వైరస్ కారణంగా రోజుకు 300ల మంది మరణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఇక టీకాలు తీసుకొని వారు.. వైరస్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టీకా తీసుకొవడం వలన ఈ వైరస్ తో (corona virus) పోరాడే శక్తి మన శరీరంలోని కణాలకు అందుతుందని వైద్యులు తెలిపారు. ఇక భారత్ లో కూడా కొన్ని వారాలుగా కరోనా కలవరపెడుతుంది. ఈ క్రమంలో కరోనా ఫోర్త్ వేవ్ లో (Covid fourth wave) ప్రవేశించిందని, కోద్ది రోజుల్లోనే వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అధికారులు ప్రజలు మరోసారి అప్రమత్తం చేశారు. కరోనా నిబంధలను పాటించాలని సూచించారు. కోవిడ్ రెండు డోసుల టీకాతోపాటు, బూస్టర్ డోసు కూడా వేసుకొవాలని సూచించారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.