కరోనా వైరస్ ప్రపంచంలోకి అడుగుపెట్టాక గతేడాది నుంచి హ్యాండ్ శానిటైజర్ అందరికీ అత్యవసరమైంది. అధిక శాతం మంది ప్రజలు శానిటైజర్‌ను వినియోగిస్తూనే ఉన్నారు. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ దీన్ని వాడాల్సిందే. అయితే ఇదే విధంగా శానిటైజర్ ఎక్కువగా వాడిన ఓ చిన్నారి ప్రతీ వస్తువును శానిటైజర్ మిషన్ అని అనుకుంది.
ఎలక్ట్రిక్ బాక్సుల నుంచి కలర్ ఇటుకల వరకు అన్నీ శానిటైజర్ స్టేషన్లే అనుకొని ఆ చిన్నారి చేతులు దగ్గర పెట్టి రఫ్ చేసుకుంది. చేతిలో శానిటైజర్ పడినట్టు ఊహించేసుకొని తుడుచుకుంది. ఈ వీడియోలను ఆ చిన్నారి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “2020 తొలి సంవత్సరమైతే.. ప్రతి ఒక్కటీ హ్యాండ్ శానిటైజింగ్ స్టేషన్లాగే కనిపిస్తుంది” అని టెక్సాస్‌కు చెందిన ఆ చిన్నారి తల్లి క్యాటీ లైట్ఫుట్ వీడియోకు క్యాప్షన్ రాశారు.
ఎలక్ట్రిస్ పోల్‌కు ఉన్న ప్లాస్టిక్ బాక్స్, రోడ్డు పక్కన అమర్చిన డబ్బాలు, కలర్ ఫుల్ ఇటుకలు ఇలా అన్నింటినీ ముట్టుకుంటూ చేతులు తుడుచుకుంటున్న ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చేతుల శుభ్రత పట్ల ఆ చిన్నారి శ్రద్ధ చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కామెంట్లు కురిపిస్తున్నారు.
When your first year of life is 2020 was all about HAND SANITIZING 😂
Cuteness is real blessing of god..
కరోనా వైరస్ కాలంలో ఇంత శుభ్రంగా ఉంటే మంచిదని అందరికీ సూచిస్తున్నారు. ఎంతో క్యూట్‌గా ఉందంటూ స్పందిస్తున్నారు. కరోనా ప్రపంచంలో కొత్త చిన్న విప్లవం అని ఓ యూజర్ విచిత్రమైన కామెంట్ చేశారు.