హోమ్ /వార్తలు /trending /

America:రష్యా దూకుడుకు కళ్లెం వేసే పనిలో అమెరికా ..సైన్యం, యుద్ధ విమానాలతో నాటో స్కెచ్

America:రష్యా దూకుడుకు కళ్లెం వేసే పనిలో అమెరికా ..సైన్యం, యుద్ధ విమానాలతో నాటో స్కెచ్

America:రష్యాను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు అమెరికా రెడీ ఉంది. ఉక్రెయిన్‌కి అండగా అంతర్జాతీయ సమాజం కూడగట్టేందుకు బైడెన్ యూరప్‌లో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు పోలాండ్‌ చేరుకోక ముందే నాటో రష్యా సరిహద్దుల్లో భారీ యుద్ధ విమానాలు, సైన్యంతో సిద్దంగా ఉంది.

ఇంకా చదవండి ...

  రష్యా( Russia)దూకుడుకి కళ్లెం వేసేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ (Biden)వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్‌ (Ukraine)పై చేస్తున్న దండయాత్రకు చెక్‌ పెట్టడంతో పాటు ఉక్రెయిన్‌కి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నాల్గు రోజుల పాటు యూరప్‌లో పర్యటిస్తారు. అయితే జోబైడెన్ పోలాండ్ చేరుకోక ముందే నాటో యాక్టివ్‌ అయింది. రష్యాపై తాడోపేడో తేల్చుకునేందుకు హంగేరి(Hungary),రొమేనియా (Romania),బల్గేరియా(Bulgaria),స్లోవేకియా (Slovakia)లో ఇప్పటికే అదనంగా నాలుగు యుద్ధ విమానాల్ని డిప్లాయ్ చేసింది. ఈ విషయాన్ని నాటోలోని అమెరికా రాయబారి జూలీ స్మిత్ (Julie Smith)చెప్పారు. సీఎన్‌ఎన్‌ (CNN) అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఏర్పాటు చేసిన బలగాలు, యుద్ధ విమానాల సిద్ధం చేసి ప్రాంతాల్లో ఎంత కాలం ఉండే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులు లేదంటే శాశ్వతంగా ఉంటుందనే సంకేతమిచ్చారు. ఉక్రెయిన్ కోసం పోలాండ్ చేసిన శాంతి ప్రతిపాదన.. ఇప్పటికీ సజీవంగానే ఉందని..ప్రపంచానికి తెలియాల్సిన ఇంకా చాల ఉన్నాయన్నారు. అంతే కాదు పోలాండ్(Poland)అంటే ఏంటో తెలుసుకోవాలని మిత్రదేశాలు భావిస్తున్నట్లుగా తెలిపారు.

  రష్యాకు చుక్కలు చూపించాలనే..

  పోలాండ్‌లో ఏర్పాటు చేసిన యుద్ధవిమానాలతో పాటుగా సుమారు 30,000 నాటో సైనికులు, మరో 200 యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు రష్యా సరిహద్దులో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అంటే నాటో వ్యవహారం చూస్తుంటే రష్యాను గట్టి దెబ్బ కొట్టేందుకు మంచి టైమ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. ఇది ఎలా ఉండనుందనే ఉదాహరణ ఇచ్చారు ఉక్రెయిన్‌పై దాడికి ముందు రష్యా చేసినట్లే ఉంటుందన్నారు. రష్యాపై దాడికి నార్వేతో పాటు సముద్రంలో ఈ కసరత్తు జరుగుతోందని జూలీ స్మిత్ చెప్పారు. రష్యాతో నార్వే 200 కిమీ భూ సరిహద్దులతో పాటు రష్యా బోర్డర్‌కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సైనిక రిహార్సల్స్ జరుగుతున్నాయి.

  అగ్రరాజ్యం భారీ స్కెచ్ వేసిందా..

  ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో యుద్ధ విమానాలు,మిసైళ్లను గుర్తించారు అధికారులు. అయితే అంత ప్రమాకరమైన ఆయుధ సామాగ్రి ఖచ్చితంగా రష్యా సైన్యానికి చెందినది కావచ్చు అంటున్నారు. అందులో వాస్తవం ఎంత ఉందో తేలాల్సి ఉంది. గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాంటి క్షిపణిని రూపొందించినట్లు పేర్కొన్నారు. అది ఎంత శక్తివంతమైన క్షిపణి అంటే ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగలదని..టార్గెట్ మిస్సవకుండా లక్ష్యాన్ని పేల్చివేయగలదన్నారు. ఈ క్షిపణిని ఆపడం ఎవరి సాద్యష్యా పేర్కొంది. రష్యా ప్రభుత్వ టీవీలో పుతిన్ ప్రజలకు ఒక ప్రదర్శన కూడా ఇచ్చారు. రష్యా ఈ స్థాయిలో డ్రోన్‌లను సిద్ధం చేస్తుంటే యూరప్‌, ఆసియాలో విస్తరించిన అమెరికా రక్షణ వ్యవస్థ కూడా దేన్ని ఆపలేరేని స్వయంగా పుతిన్‌ అన్నారు. ఈ సమయంలోనే అమెరికా కూడా తన అణ్వాయుధాలను తయారు చేయాలని ఆదేశించింది.నాటోలో సభ్యత్వం ఉన్న దేశాలు ఏర్పాటవుతాయి.. అందుకే ఇప్పుడు రష్యాకు దీటుగా సమాధానం చెప్పేందుకు నాటో ఇంతకాలం పెట్టుకున్న అడ్డుగోడలు తొలగించాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. అలాగే యూరప్‌ టూర్‌లో ఉన్న బైడెన్ రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు కూడా ప్రకటించే అకాశం కనిపిస్తోంది.

  First published:

  ఉత్తమ కథలు