గూగుల్‌పై రూ.344 కోట్ల దావా వేసిన తులసి గబ్బార్డ్... ఎందుకంటే...

Tulsi Gabbard : 2020లో అమెరికా ఎన్నికల్లో... 20 మంది డెమొక్రాట్లలో ఒకరిగా పోటీ పడుతున్న తులసీ గబ్బార్డ్... గూగుల్‌పై ఎందుకు మండిపడుతున్నారు. ఎందుకు దావా వేశారు?

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 11:12 AM IST
గూగుల్‌పై రూ.344 కోట్ల దావా వేసిన తులసి గబ్బార్డ్... ఎందుకంటే...
తులసీ గబ్బార్డ్ (twitter - cnn politics)
  • Share this:
సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించి ఉండకపోవచ్చు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని... ట్రంప్‌ని గద్దె దింపాలని చూస్తున్న డెమోక్రాట్ల ప్రతినిధి తులసి గబ్బార్డ్‌ గూగుల్‌పైనే రివర్స్ అయ్యారు. తనకు సంబంధించిన ప్రచార ప్రకటనలపై గూగుల్... వివక్ష చూపుతోందని మండిపడ్డారు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.344 కోట్లు (50 మిలియన్ డాలర్లు) చెల్లించాలంటూ... ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ ధోరణి అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. అమెరికా ప్రజల తరపున దీనిపై తన పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. ఇలా ఓ పొలిటీషియన్... టెక్నాలజీ కంపెనీపై దావా వేయడం ఇదే తొలిసారి.

2019, జూన్ 27-28న రాత్రి వేళ నాలుగు గంటలపాటు తన ప్రచార ప్రకటనల అకౌంట్‌ను గూగుల్ నిలిపివేసిందని గబ్బార్డ్ ప్రచార కమిటీ అంటోంది. ఇలా చెయ్యడం వల్ల తమకు రూ.344 కోట్ల నష్టం జరిగిందని చెబుతోంది. తన ప్రకటనల ద్వారా గబ్బార్డ్... డొనేషన్లు సేకరిస్తున్నారు. వాటిని ప్రచారం కోసం వాడుకుంటున్నారు.

నిజానికి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జూన్‌లో మొదటి డిబేట్‌లో ఆమె పాల్గొన్న తర్వాత... ఆమెకు సంబంధించి సెర్చింగ్ ఎక్కువైంది. దాంతో గూగుల్... తాత్కాలికంగా ఆమె యాడ్స్ అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అకౌంట్ ఎందుకు సస్పెండ్ చేసిందీ గూగుల్ ఇప్పటికీ చెప్పలేకపోతోందనీ, కారణం ఇది కుట్రపూరితంగా జరిగిందని గబ్బార్డ్ ప్రతినిధి అంటున్నారు.

గూగుల్ చెబుతున్నదొకటే. గూగుల్ లోని ఆటోమేటిక్ సిస్టమ్స్... ఏదో అసాధారణ యాక్టివిటీ జరుగుతోందనీ, మోసం జరుగుతోందని గ్రహించడం వల్లే సస్పెండ్ చేశాయని అంటోంది.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు