Home /News /trending /

US PRESIDENT JOE BIDEN INVISIBLE HANDSHAKE GOES VIRAL PVN

Viral Video : గాల్లో బైడెన్ షేక్ హ్యాండ్..గందరగోళ చూపులు..వీడియో వైరల్

జోబైడెన్

జోబైడెన్

Joe Biden invisible handshake : ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోటుపై పిట్ట రెట్ట వేసినట్టు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై ఇటీవలే శ్వేత సౌధం క్లారిటీ కూడా ఇచ్చింది.

Joe Biden invisible handshake : ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కోటుపై పిట్ట రెట్ట వేసినట్టు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై ఇటీవలే శ్వేత సౌధం క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి బైడెన్ తీరుపై వివరణ ఇచ్చుకునే పరిస్థితి వైట్ హౌస్‌ కు వచ్చింది. తాజాగా జో బిడెన్ వీడియో మరొకటి నెట్టింట వైరల్(Viral Video) గా మారింది. నార్త్ క‌రోలినాలోని గ్రీన్స్‌ బోరోను తాజాగా జో బైడెన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏ అండ్ టీ స్టేట్ యూనివ‌ర్సిటీలో ఏర్పాటు చేసిన స‌భ‌లో 40 నిమిషాలు ప్ర‌సంగించారు.

తన స్పీచ్ పూర్తయ్యిన తరువాత పోడియం నుంచి కిందకు వెళ్లేందుకు బైడెన్ వెనక్కు తిరిగారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఎడవైపు చూస్తూ.. ఎవరికో షేక్ హ్యాండ్ ఇవ్వడానికన్నట్టు చేయి చాచారు. అయితే, అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. . ఆ తరువాత కూడా బైడెన్ ఎటు వెళ్లాల్లో తెలీక క్షణకాలం పాటు అలా నిలబడిపోయారు.


ఈ వీడియోను ట్విట‌ర్‌లో వాషింగ్ట‌న్ ఫ్రీ బీక‌న్ అనే యూజ‌ర్ పోస్ట్ చేయ‌గా అది వైరల్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆరు మిలియ‌న్ల మంది ఈ వీడియోను చూశారు. మరి దీనిపై వైట్‌ హౌస్ ఏం వివరణ ఇస్తుందో తెలియాలంటే ఓ రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Joe Biden, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు