Home /News /trending /

Biden Jinping meet : ట్రంప్ లేని అమెరికాతో చైనా మళ్లీ దోస్తీ -బైడెన్, జిన్‌పింగ్ చారిత్రక భేటీ -కీలక ఒప్పందాలు

Biden Jinping meet : ట్రంప్ లేని అమెరికాతో చైనా మళ్లీ దోస్తీ -బైడెన్, జిన్‌పింగ్ చారిత్రక భేటీ -కీలక ఒప్పందాలు

అమెరికా, చైనా అధ్యక్షుల వర్చువల్ భేటీ

అమెరికా, చైనా అధ్యక్షుల వర్చువల్ భేటీ

ఆర్థిక, సైనిక, రాజకీయ బలాల పరంగా ప్రపంచంలోనే టాప్-2 అగ్రదేశాలైన అమెరికా, చైనాల మధ్య స్నేహం మళ్లీ చిగురించింది. ట్రంప్ ఏలుబడిలో దారుణంగా దెబ్బ తిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకుంటున్నారు దేశాధినేతలు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.

ఇంకా చదవండి ...
ఆర్థిక, సైనిక, రాజకీయ బలాల పరంగా ప్రపంచంలోనే టాప్-2 అగ్రదేశాలైన అమెరికా, చైనా (china)ల మధ్య స్నేహం మళ్లీ చిగురించింది. ట్రంప్ ఏలుబడిలో దారుణంగా దెబ్బ తిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకుంటున్నారు దేశాధినేతలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్(Xi Jinping) మంగళవారం ఉదయం(చైనా కాలమానం ప్రకారం) భేటీ అయ్యారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల నేతలు కీలక అంశాలపై సూత్రప్రాయంగా ఏకాభిప్రాయాలకు వచ్చారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత అగ్రదేశాల అధినేతలు సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్న ఈ భేటీని రెండు దేశాలూ చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తున్నాయి..

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు వర్చువల్ గా పాల్గొన్న భేటీలో ఆర్థిక, సైనికపరమైన అంశాలపైనే ప్రధాన చర్చ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు ఇకపై ఉద్రిక్తతలను పక్కన పెట్టి, యుద్ధవాతావరణాన్ని పూర్తిగా నివారించి, పరస్పర సహకారంతో కదలాలనే నిర్ణయానికి ఇరు దేశాల అధినేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ట్రంప్ దిగిపోయి, బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికా తన చైనా విధానాన్ని సమూలంగా మార్చేసుకుంది. చైనాతో ఒక దశలో యుద్దానికి కూడా సిద్దమని ప్రకటించిన ట్రంప్.. కరోనా మహమ్మారికి కారణం డ్రాగన్ దేశమేనంటూ దూషించిన సంగతి తెలిసిందే. కాగా,

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ఖతం -గద్దె దించనున్న ఆర్మీ -కారణాలివే -pakistan కొత్త ప్రధాని ఎవరంటే


ట్రంప్ లేని అమెరికా.. పలు అంశాల వారీగా చైనాకు మిత్రురాలిగానే వ్యవహరిస్తుందని జోబైడెన్ తన చర్యలతో రుజువుచేశారు. ఇటీవల స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నగరంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులెవాన్‌, చైనా దౌత్యవేత్త యాంగ్‌ జీచిల మధ్య జరిగిన సమావేశమే.. ఇప్పటి అధినేత వర్చువల్ భేటీకి దారి తీసింది. అనూహ్య రీతిలో ఈ మీటింగ్ లో అమెరికా అధ్యక్షుడు తన వెనుక చైనా జెండాను ఉంచుకుని మాట్లాడగా, చైనా అధ్యక్షుడేమో అమెరికా జెండాను తన ముందుంచుకుని మాట్లాడారు. సైనిక, ఆర్థికపరమైన అంశాలతోపాటు జర్నలిస్టుల వీసాలపై నియంత్రణలను సడలించేందుకు ఒప్పందంపైనా ఇరుదేశాలు చర్చించాయని తెలుస్తోంది. అంతేకాదు,

Etela Rajender ఆ పని చేయగలరా? -cm kcrకు షాకిచ్చేలా bjp సరికొత్త వ్యూహం ఇదే..


చైనాతో డెమోక్రాట్లు కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోతోందని వాదించిన రిపబ్లికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తన నాలుగేళ్ల పాలనలో చైనాకు సంబంధించిన దాదాపు అన్ని అంశాలను తిరగరాశారు. పలు వ్యాపార ఒప్పందాలను రద్దు చేశారు. చివరికి దౌత్య దారుల్ని కూడా దాదాపు మూసేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ఆరోపించారు. బైడెన్ ఎన్నిక తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2020లో దౌత్యపరమైన వివాదంతో మూతపడిన చెంగ్డు, హ్యూస్టన్‌లలోని కార్యాలయాలను తిరిగి ప్రారంభించే ఒప్పందంపైనా రెండు దేశాలు చర్చించాయని తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: China, Joe Biden, Us, USA, Xi Jinping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు