Donald Trump: డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన వీడియో దుమ్మురేపుతోంది... రజనీకాంత్ డైలాగ్ గుర్తొస్తుంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వీడియోను షేర్ చేశారు. 2.20 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో 1.2 మిలియన్ల వ్యూస్ సాధించింది.

news18-telugu
Updated: November 27, 2020, 9:44 PM IST
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన వీడియో దుమ్మురేపుతోంది... రజనీకాంత్ డైలాగ్ గుర్తొస్తుంది
డొనాల్డ్ ట్రంప్ (credit - twitter - reuters)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వీడియోను షేర్ చేశారు. 2.20 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో 1.2 మిలియన్ల వ్యూస్ సాధించింది. డాన్ స్కావినో అనే ట్విట్టర్ యూజర్ నవంబర్ 22న ఈ వీడియోను పోస్ట్ చేశారు. బీబీసీ వాటర్ మార్క్ ఉన్న ఆ వీడియోలో ఓ సింహానికి సంబంధించిన కథ ఉంది. అందులో ఓ సింహం హైనాల మధ్యకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న సింహాన్ని ఆ హైనాలు ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాయి. ఆ సింహం కూడా వాటితో పోరాడింది. అలా సింహం, హైనాల మధ్య కొంతసేపు ఫైట్ జరిగింది. గుంపుగా ఉన్న హైనాలు సింగల్‌గా ఉన్న సింహం మీద ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాయి. అయితే, కొంతసేపటి తర్వాత అటు వైపు మరో సింహం వచ్చింది. తన తోటి సింహం మీద హైనాలు దాడి చేస్తున్న దృశ్యాన్ని చూసిన మరో సింహం.. వెంటనే రంగంలోకి దిగింది. దీంతో రెండు సింహాలను చూసిన హైనాలు దెబ్బకు అక్కడి నుంచి పారిపోయాయి. ఆ తర్వాత రెండు సింహాలు చక్కగా వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం తెలియదు. వీడియో అంతవరకే ఉంది. ఆ హైనాల్లో ఒక్కదాన్నైనా ఆ సింహాలు వేటాడాయా? లేవా? అనేది తెలీదు. ఈ వీడియోను షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ‘చాలా వాస్తవం’ అని కామెంట్ చేశారు.



‘చాలా వాస్తవం’ అని కామెంట్ చేయడం వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తనను తాను సింహంతో పోల్చుకున్నారా? లేకపోతే కలసి ఉంటే కలదు సుఖం అనే భావనతో ఆ కామెంట్ చేశారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన డొనాల్డ్ ట్రంప్‌కు అతడి భార్య మెలానియా ట్రంప్ విడాకులు ఇస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి వీడియోను ట్రంప్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Raghavendra Rao: హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్రరావు, నలుగురు హీరోయిన్లు..

వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?

ఈ నెల 4న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. డొనాల్డ్ ట్రంప్ ఓటమి చెందారు. అయితే, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికార మార్పిడి జరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే, తానే ఎన్నికల్లో గెలిచానంటూ ట్రంప్ కొంత హడావిడి చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తాను దిగబోనంటూ కూడా మారాం చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ, చివరకు అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయాలంటూ ఆయన అధికారులకు సూచించారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ 2021 జనవరిలో ప్రమాణస్వీకారం చేస్తారు. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2020, 9:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading