ట్రంప్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిన ‘తాజ్ మహల్’

‘తాజ్ మహల్’ ట్రంప్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ కాదండోయ్.. 1990లో న్యూజెర్సీలోని అట్లంటిక్ సిటీలో తాజ్ మాహల్ పేరుతో క్యాసినోను ట్రంప్ ప్రారంభించారు.

news18-telugu
Updated: February 25, 2020, 11:05 AM IST
ట్రంప్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిన ‘తాజ్ మహల్’
ట్రంప్ తాజ్ మహల్ క్యాసినో
  • Share this:
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి నిన్న తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రేమ చిహ్నాన్ని చూడగానే ‘వావ్.. అద్భుతం’ అంటూ వ్యాఖ్యానించారు. గొప్ప అనుభూతి కలిగిందని చెప్పారు. అయితే, ‘తాజ్ మహల్’ ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ కాదండోయ్.. 1990లో న్యూజెర్సీలోని అట్లంటిక్ సిటీలో తాజ్ మాహల్ పేరుతో క్యాసినోను ట్రంప్ ప్రారంభించారు. దాన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే సంస్థ దివాలాకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దాన్ని ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చి నిర్వహించారు. అప్పటికే అది రెండు సార్లు దివాలా తీసి కష్టాలు మిగిల్చింది. అయితే.. ట్రంప్ మాత్రం వ్యక్తిగతంగా బాగానే సంపాదించారు. తాజ్ మహల్‌ను 2017లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్‌కు అమ్మేశారు. అప్పటికి ట్రంప్‌కు మాతృ సంస్థలో వాటానే లేదు.
ట్రంప్‌కు చెందిన తాజ్ మహల్ క్యాసినో
Published by: Shravan Kumar Bommakanti
First published: February 25, 2020, 11:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading