హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Cockroaches: బంపర్ ఆఫర్.. ఇంట్లో 100 బొద్దింకలు పెంచితే చాలు.. నెలకు లక్షన్నర ఆదాయం..

Cockroaches: బంపర్ ఆఫర్.. ఇంట్లో 100 బొద్దింకలు పెంచితే చాలు.. నెలకు లక్షన్నర ఆదాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cockroaches: బొద్దింకలను పెంచితే.. లక్షలు ఇవ్వడమేంటి? వాటి వల్ల వారికేంటి ఉపయోగం? ఎందుకిలా చేస్తున్నారు? అని ఆలోచిస్తున్నారా? ఐతే ఈ స్టోరీ చదవండి.

మన ఇళ్లల్లో ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తూనే ఉంటాయి. దోగలు, ఈగలు, చీమలు, బొద్దింకలు.. ఇలా ఎన్నో రకాల కీటకాలు మనల్ని చికాకు పెడుతుంటాయి. ఇంట్లో కనిపించే జంతువులు, కీటకాల్లో బొద్దింక అత్యంత అసహస్యమైనదిగా చూస్తారు. బొద్దింకలను చూస్తే కొందరు భయపడిపోతుంటారు. మరికొందరు అసహస్యించుకుంటారు. మొత్తంగా ఇలాంటి కీటకాలు ఎవరికీ నచ్చవు. వాటిని బయటకు పంపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. రకాల రకాల మందులను ప్రయోగిస్తుంటారు. ఏం చేసైనా.. బొద్దింకల(Company Offering People 1.5 Lakh for Infesting Home with Cockroach)ను వదిలించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఐతే మనం బొద్దింకల బెడద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.. కానీ అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం.. బొద్దింకలు పెంచితే.. లక్షలు రూపాయల డబ్బు (Company Offering Money to Infest Home With Cockroaches) ఇస్తోంది. కేవలం 100 బొద్దింకలను పెంచితే.. నెల రోజులకే లక్షన్నర చెల్లిస్తుందట.

అమెరికాలో కోవిడ్ సునామీ..భారీగా కేసులు,మరణాలు..మరో ముప్పు తప్పదా

బొద్దింకలను పెంచితే.. లక్షలు ఇవ్వడమేంటి? వాటి వల్ల వారికేంటి ఉపయోగం? ఎందుకిలా చేస్తున్నారు? అని ఆలోచిస్తున్నారా? ఏ కంపెనీ కూడా ఊరికే డబ్బులు ఇవ్వదు. వారికి లాభం ఉంటేనే... ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు చెబుతున్న కంపెనీ కూడా అలాంటిదే. అమెరికాలోని నార్త్ కరోలినా (North Carolina) కు చెందిన ఓ కంపెనీ కొత్త పెస్ట్ కంట్రోల్ మెడిసిన్‌పై కొంత కాలంగా పరిశోధన చేస్తోంది. ఆ పరిశోధన కోసం చాలా బొద్దింకలు అవసరం. వాటన్నింటినీ కంపెనీ పెంచడం సాధ్యం కాదు. అందుకే బొద్దింకలను పెంచేందుకు అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. బొద్దింకలను పెంచే వారి కోసం వెతుకుతోంది. ఎవరైనా తమ ఇళ్లల్లో బొద్దింకలు పెంచితే.. వారికి డబ్బులు ఇస్తామని ఆఫర్ ఇస్తుంది. వీరి ఇళ్లలో కనీసం 100 బొద్దింకలు వదిలివేస్తారు. వాటిపై కంపెనీ ప్రతినిధులు నిత్యం పరిశోధన చేస్తుంటారు. తాము తయారు చేసిన మందును ప్రయోగిస్తుంటుంది. ఇంట్లో కెమెరాలు పెట్టి బొద్దింకలను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వారికి $ 2000 అంటే భారతీయ కరెన్సీలో 1.5 లక్షల రూపాయల కంటే ఎక్కువే ఇస్తారు.

ఈ పరిశోధన దాదాపు నెల రోజుల పాటు ఉంటుంది. ఆ నెల రోజుల్లో సదరు కంపెనీ పనిచేసి బొద్దింకలన్నీ చనిపోతే ఓకే. వారి ట్రయల్స్ సక్సెస్ అయినట్లు భావించాలి. లేదంటే.. రీసెర్చ్ పూర్తయ్యాక కంపెనీయే ఇతర పద్దతుల్లో బొద్దింకలను నిర్మూలిస్తుంది. సొంత ఖర్చులతోనే వాటిని తొలగిస్తారు. ఇంటి నుంచి బొద్దింకలన్నీ తొలగించాకే.. మీకు తిరిగి అప్పగిస్తారు. ఐతే ఈ ఆఫర్ ఎవరికి పడితే వారికి వర్తించదు. అమెరికాలో నివసించే వారికే ఇది వర్తిస్తుంది. అంటే బొద్దింకలు పెంచే ఇళ్లు అమెరికాలో ఉండాలన్న మాట. అంతేకాదు.. కంపెనీకి తప్పనిసరిగా రాతపూర్వకంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా.. మనకు అసహ్యం కలిగించే బొద్దింక.. అమెరికన్లకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఐనప్పటికీ చాలా మంది మాత్రం వాటిని పెంచేందుకు ముందుకు రావడం లేదు.

First published:

Tags: America, Trending, Trending news, Us news

ఉత్తమ కథలు