news18
Updated: November 25, 2020, 7:05 PM IST
image credits Twitter
- News18
- Last Updated:
November 25, 2020, 7:05 PM IST
మాయదారి మహమ్మారి కరోనా తీసుకొచ్చిన సంక్షోభం లెక్కలేని నష్టాన్ని తీసుకొస్తున్నది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి.. లక్షలాది మంది మరణించగా.. కోట్లాది మంది పాజిటివ్ గా తేలారు. పలు దేశాలలో దీని సెకండ్, థర్డ్ వేవ్ లు కూడా మొదలై జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలాఉండగా.. కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తున్న వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి రోగుల గదుల్లోనే ఉంటుండటం.. మాస్కులు, పీపీఈ కిట్లు ధరిస్తుండటంతో వారి ముఖాలు గుర్తు పట్టడానికి వీలు లేకుండా మారిపోతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఒక నర్సు.. తన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో చూసినవారంతా అసలు ఆ రెండు ఫోటోలలో ఉన్నది ఒకరేనా..? అంటూ షాక్ కు గురవుతున్నారు.
యూఎస్ లోని టెన్నీస్సీకి చెందిన క్యాథరిన్ స్థానికంగా ఉండే ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నది. కొద్ది రోజుల క్రితమే ఆమె వైద్య పట్టా అందుకుని.. నర్సుగా సేవలందిస్తున్నది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యూఎస్ లో కరోనా కోరలు విప్పుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఆమె కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నది. ఇందుకోసం గానూ సుమారు 12 నుంచి 14 గంటల దాకా ఆమె ప్రత్యేక వార్డులలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో తప్పనిసరిగా మాస్కు, పీపీఈ కిట్ ధరించాల్సి వస్తుంది.
వరుసగా ఏడు నెలల పాటు ఈ డ్యూటీ చేస్తున్నందువల్ల ఆమె ముఖం గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగావెల్లడించారు. ట్విట్టర్ లో ఆమె.. కరోనాకు ముందు తీసుకున్న ఫోటోతో పాటు ఇటీవల తీసుకున్న ఫోటోను జత చేసి షేర్ చేసింది. ఆ ఫోటోకు..‘ఇది ఇలా మొదలై.. ఇలా కొనసాగుతున్నది..’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది.చాలా మంది ఈ ఫోటోను షేర్ చేస్తూ.. క్యాథరిన్ చేస్తున్న సేవకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రాణాలక తెగించి ఆమె చేస్తున్న సేవకు అందరూ శెభాస్ అంటున్నారు. కరోనా వల్ల వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులకు క్యాథరిన్ నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 25, 2020, 7:05 PM IST