• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • US MIT SCIENTISTS TRANSLATED THE STRUCTURE OF A SPIDER WEB INTO MUSICAL NOTES HERE THE FULL DETAILS GH SRD

Spider webs: సాలీడు గూళ్ల నిర్మాణాలతో సంగీతం..సాలె పురుగుల భాషను అర్థం చేసుకునేలా పరిశోధన..

Spider webs: సాలీడు గూళ్ల నిర్మాణాలతో సంగీతం..సాలె పురుగుల భాషను అర్థం చేసుకునేలా పరిశోధన..

ప్రతీకాత్మక చిత్రం

Spider webs: సాలీడు గూళ్లు సంక్షిష్టమైన సహజ నిర్మాణాలు. సాలె పురుగులు వేటాడడానికి, సంతానోత్పత్తికి ఈ 3D నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటాయి. సాలె గూళ్లు విభిన్నమైన పౌనపున్యాలను (ఫ్రీక్వెన్సీ) కలిగి ఉంటాయి.

  • Share this:
సాంకేతికత ద్వారా వివిధ రకాల జీవుల కమ్యూనికేషన్ వ్యవస్థను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా పరిశోధకులు. తాజాగా సాలె పురుగుల భాషను అర్థం చేసుకునే ప్రయోగంలో మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సాలీడు గూడు నిర్మాణాన్ని వారు మ్యూజికల్ నోట్స్ రూపంలోకి అనువదించారు. ఈ గూళ్ల ద్వారా ఉత్పన్నమైన మెలోడీల సాయంతో మనుషులు సాలెపురుగులతో మాట్లాడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాలీడు గూళ్లు సంక్షిష్టమైన సహజ నిర్మాణాలు. సాలె పురుగులు వేటాడడానికి, సంతానోత్పత్తికి ఈ 3D నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటాయి. వీటిపై మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. వీరు తాజాగా ఒక సాలీడు గూడు నిర్మాణాన్ని సంగీతం రూపంలోకి మార్చగలిగారు. సాధారణంగా స్పైడర్లు బాగా చూడలేవు. అందువల్ల అవి వైబ్రేషన్ల ద్వారా అన్ని విషయాలనూ గ్రహిస్తాయని ప్రధాన పరిశోధకుడు మార్కస్ బ్యూహ్లెర్ చెబుతున్నారు. ఆయన MITలో పరిశోధన చేస్తున్నారు. సాలె గూళ్లు విభిన్నమైన పౌనపున్యాలను (ఫ్రీక్వెన్సీ) కలిగి ఉంటాయి.

సాలీడు ఈ గూళ్లను నిర్మించే సమయంలో ఒక పోగును సాగదీసినప్పుడు.. లేదా గాలి వల్ల.. లేదంటే ఈ గూళ్లకు చిక్కుకున్న ఈగలు, ఇతర పురుగులు గట్టిగా కదిలినప్పుడు ఒక రకమైన వైబ్రేషన్లు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. మనుషులకు సంబంధం లేని సహజ పదార్థాల నుంచి రిథమ్స్, మెలోడీలను వెలికితీయడానికి ఈ అధ్యయనం సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరు 3D ఆర్కిటెక్చర్, సాలీడు గూళ్ల నిర్మాణంపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

సాలీడు గూళ్ల నుంచి సంగీతాన్ని ఎలా వెలికితీయాశామనే వివరాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ బృందం ముందు ఒక సహజమైన సాలె గూడును సేకరించారు. లేజర్ సాయంతో దాన్ని స్కాన్ చేసి 2D క్రాస్ సెక్షన్లను సంగ్రహించారు. ఆ తరువాత నిర్మాణం 3D నెట్‌వర్క్‌ను పునర్నిర్మించడానికి కంప్యూటర్ అల్గారిథంలను ఉపయోగించారు. సాలె గూడులోని వివిధ రకాల పోగులకు విభిన్నమైన ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. సాలీడు గూడు 3D నిర్మాణం ఆధారంగా వాటిని కలిపి కుట్టారు. ఈ సమయంలో మ్యూజిక్ నోట్స్‌ ఏర్పడ్డాయి. ఆ తరువాత సాలీడు నిర్మాణాల లైవ్ మ్యూజిక్‌ను సృష్టించే ఒక పరికరాన్ని సృష్టించారు. ఈ మ్యూజిక్‌ను వినడానికి ఒక వర్చువల్ రియాలిటీ సెటప్‌ను సైతం ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సాలె పురుగులతో కమ్యూనికేట్ కావచ్చని గుర్తించారు. ఈ సంగీతాన్ని వినడం ద్వారా సాలీడు నివసించే వాతావరణాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని బ్యూహ్లెర్ వివరించారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు