• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • US MAN BUYS 160 LOTTERY TICKETS FOR ONE DRAWING WINS 160 TIMES HE GOT 8 LAKHS DOLLARS SK GH

ఇతడిపై కోట్ల వర్షం.. ప్రపంచంలోనే లక్కీఫెలో.. 160 లాటరీ టిక్కెట్లు కొని అన్నీ గెలిచాడు

ఇతడిపై కోట్ల వర్షం.. ప్రపంచంలోనే లక్కీఫెలో.. 160 లాటరీ టిక్కెట్లు కొని అన్నీ గెలిచాడు

ఇతడిపై కోట్ల వర్షం.. ప్రపంచంలోనే లక్కీఫెలో.. 160 లాటరీ టిక్కెట్లు కొని అన్నీ గెలిచాడు

ఓ రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్(Fastfood) కోసం లైన్‌లో వేచి చూస్తున్న సందర్భంలో లాటరీలో తగిలినట్లు విన్నానని క్వామే క్రాస్ చెప్పాడు. అంతేకాకుండా కాసేపు ఇది నిజమేనా అని అనిపించింది, దాదాపు 82 సార్లు తిరిగి చెక్ చేసుకున్నాక ధృవీకరించుకున్నట్లు స్పష్టం చేశాడు.

  • Share this:
అదృష్టమంటే ఇతడిదే. ఎందుకంటే ధనలక్ష్మీ తలుపుతట్టి.. కాసుల వర్షం కురిపించింది. లాటరీల రూపంలో కోట్లకు కోట్లు కుమ్మరించింది. ఎవరూ ఊహించని జాక్‌పాట్‌ను గిప్ట్‌గా ఇచ్చింది. సాధారణంగా లాటరీ తగిలితే చాలా ఎంత మంది అదృష్టంగా భావిస్తుంటారు. 10-20 లాటరీ టికెట్లు కొంటే అందులో ఒకటి కూడా తగలేది చాలా కష్టం. కానీ ఇతడు 160 లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తే.. అన్నీ గెలిచాడు. ప్రపంచంలో ఇంకెవరినీ ఇంత అదృష్టం వరించలేదేమో.. అందుకే ఇతడిని నెంబర్ వన్ లక్కీఫెలో‌గా చెప్పుకోవచ్చు.

అమెరికా వర్జీనియాలోని డ్రమ్ ఫ్రైస్‌కు చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి.. రోస్లిన్ సునోకో సంస్థ నుంచి పిక్ 4 లాటరీ కోసం 160 టిక్కెట్లను కొనుగోలు చేశాడు. ఆ టిక్కెట్లన్నీ 7314 సిరిస్ కలిగి ఉండేలా చూసుకున్నాడు. చివరకు లాటరీ డ్రా తీస్తే.. మనోడు కొన్న టికెట్లన్నీ విజేతగా నిలిచాయి. అంటే 160 టికెట్లకు 160 గెలిచాయన్న మాట. ఈ విషయం గురించి అతడిని అడగ్..గా ఓ టీవీ షోలో ఓ అడ్రస్(Address)ను చూసి ఆ నెంబర్ ను నోట్ చేసుకున్నానని చెప్పాడు. ఒక్కో టికెట్‌కు 5వేల డాలర్ల చొప్పున మొత్తం.. 8 లక్షల డాలర్లను గెలుచుకున్నాడు. మన భారత కరెన్సీలో రూ.5.89 కోట్లు సాధించాడు క్వామే క్రాస్.

ఓ రెస్టారెంట్లో ఫాస్ట్ ఫుడ్(Fastfood) కోసం లైన్‌లో వేచి చూస్తున్న సందర్భంలో లాటరీలో తగిలినట్లు విన్నానని క్వామే క్రాస్ చెప్పాడు. అంతేకాకుండా కాసేపు ఇది నిజమేనా అని అనిపించింది, దాదాపు 82 సార్లు తిరిగి చెక్ చేసుకున్నాక ధృవీకరించుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ డబ్బుతో ఏం చేయాలో ఇంకా తాను నిర్ణయించుకోలేదని అతడు తెలిపాడు.

ఈ విధంగా నక్క తోక్కిన వారిలో ఇతడు ఒక్కడు ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. గతంలో రేమండ్ హారింగ్టన్ అనే వ్యక్తి ఇదే లాటరీ డ్రా(Lottery Drwa)లో 25 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి 25 సార్లు విజేతగా(Winner) నిలిచాడు. దాదాపు 1,25,000 డాలర్లను గెలిచి ధనవంతుడయ్యాడు. మరోక సంఘటనలో మిచిగాన్ కు చెందిన సమీర్ మజామోమే అనుకోకుండా రెండు టిక్కెట్లను కొనుగోలు చేసి ఒక్కో టిక్కెట్టుకు(Ticket) ఒక మిలియన్ డాలర్ ప్రైజ్ మనీ(Prize Money) సొంతం చసేసుకున్నాడు. రెండు మిలియన్ డాలర్లు గెలవడం నమ్మలేకపోతున్నాని బదులిచ్చాడు. ఇది నిజమని నమ్మడానికి రెండు రోజులు పట్టిందని.. కొంత సొమ్ము పొదుపు(Save) చేసుకుని మరికొంత సొమ్ముతో ఇల్లు కొనుగోలు చేసుకుంటానని చెప్పాడు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు