హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: ఇంట్లోకి పాము వచ్చిందని భయంతో కర్ర విసిరాడు.. అంతే రూ. ఏడున్నర కోట్లు మటాష్

Viral News: ఇంట్లోకి పాము వచ్చిందని భయంతో కర్ర విసిరాడు.. అంతే రూ. ఏడున్నర కోట్లు మటాష్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral News: కాలి బూడిదయిన ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నీ కంటే దరదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. అగ్గితో ఆటలాడితే ఫలితం ఇలానే ఉంటుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

పాములను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. అది చిన్న పామైనా..పెద్ద పామైనా..విషం ఉన్నా..లేకున్నా... పాము కనిపిస్తే చాలు వణుకుపుడుతుంది. ఇలాగే ఓ వ్యక్తి పాముకు భయపడి కర్రను విసిరేశాడు. తన ఇంట్లోకి పామురావడంతో  కంగారులో దానిని కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అంతే.. సీన్ కంటే.. అతడికి రూ.7.50 కోట్ల నష్టం వచ్చింది. ఎంతో కష్టపడి కట్టుకున్న తన ఇల్లు పూర్తిగా నేలమట్టమయింది.  పామును కొడితే ఇల్లు కూలిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఐతే పూర్తి వివరాలు తెలుసుకోండి.

అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి నవంబరు 23న రాత్రి 10 గంటల సమయంలో పాము వచ్చింది. ఆ సమయంలో అతడు క్యాంప్ ఫైర్ వద్ద చలి కాచుకుంటున్నాడు. అప్పుడే ఓ పాము ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో భయంతో వణికిపోయడు. ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పొయ్యిలో నుంచి మండుతున్న కర్రను తీసి పాముపై విసిరేశాడు. అది పాముకు తగలకుండా నేరుగా వెళ్లి డోర్ కర్టెన్‌పై పడింది. క్షణాల్లోనే మంటలు అంటుకున్నాయి. వాటిని చల్లార్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. వేగంగా ఇల్లు మొత్తం విస్తరించాయి.

viral video : విమానాన్ని చేతులతో నెట్టుకుంటూ తీసుకెళ్లిన ప్రయాణికులు -అసలేం జరిగిందంటే..


మంటలను చూసి అతడు భయంతో బయటకు పరుగులు తీశాడు. అగ్నిమాపక దళానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అది చాలా పెద్ద భవనం కావడంతతో   75 మంది ఫైర్ ఫైటర్స్ చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. అది చెక్కతో కట్టిన ఇల్లు కావడంతో పూర్తిగా తగలబడింది. చూస్తుండగానే భవనం మొత్తం కాలిపోయి..కూలిపోయింది. ఇంట్లో సామాగ్రి మొత్తం బూడిదయింది.  మంట్లో కాలిపోయిన ఆ ఇంటికి ఏడున్నర కోట్లు ఉంటుందని యజమాని చెప్పాడు. ఎంతో ఇష్టపడి.. కష్టపడి.. ఇల్లు కట్టుకున్నానని అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Tea Facts: మనం రోజూ తాగే టీని ఎవరు కనిపెట్టారో తెలుసా..? చాయ్ గురించి మీకు తెలియని నిజాలు.


Viral: ఫుల్లుగా తాగిన భర్త.. ఇంటికెళితే భార్య ఇలా కొడుతుందని భయపడి చెప్పిన  ఒక్క అబద్ధం వల్ల..

కాలి బూడిదయిన ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నీ కంటే దరదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. అగ్గితో ఆటలాడితే ఫలితం ఇలానే ఉంటుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. వన్యప్రాణిని చంపాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఐతే ఇంతటి నష్టానికి కారణమైన ఆ పాము మాత్రం ఏమైందో తెలియలేదు. మంటలు రాజుకొనే లోపే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందా.. లేదంటే మంటల్లో కాలిపోయి బూడిదయిందా? అనేది ఇప్పటి వరకూ తెలియలేదు. కానీ ఆ పాము మాత్రం.. ఇంటి యజమానికి పెద్ద చేదు జ్ఞాపకమే మిగిల్చింది.

First published:

Tags: America, Us news, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు