Inmates Escaped Prison Using Toothbrush : జైలు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు ఇద్దరు ఖైదీలు(Inmates) ఖతర్నాక్ స్కెచ్ వేశారు. టూత్ బ్రష్‌ను ఉపయోగించి ఏకంగా జైలు గోడకి రంధ్రం వేసి పారిపోయారు. కొన్ని గంటల తర్వాత సోమవారం సాయంత్రం రొటీన్ హెడ్ కౌంట్ సమయంలో ఇద్దరు ఖైదీలు తప్పిపోయినట్లు విషయం గుర్తించారు పోలీసులు. జైల్లో ఇద్దరు ఖైదీలు చేసిన పని పోలీసులకే దిమ్మతిరిగిపోయేలా చేసింది. అమెరికాలోని(USA) వర్జీనియా రాష్ట్రంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
జాన్ గార్జా(37), అర్లె నెమో(43) అనే ఇద్దరు వ్యక్తులను వేర్వేరు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కోర్టు ధిక్కారం, అతని పర్యవేక్షణ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అనేక నేరాల కారణంగా గార్జా జైలు పాలయ్యాడు. కోర్టు ధిక్కారం, ఫోర్జరీ, క్రెడిట్ కార్డ్ మోసం, క్రెడిట్ కార్డ్ దొంగిలించడం మరియు దొంగతనానికి సంబంధించిన పనిముట్లను కలిగి ఉండటం వంటి అనేక కేసుల్లో నెమోను అదుపులోకి తీసుకున్నారు. అయితే జైలు నుంచి తప్పించుకునేందుకు ఈ ఆ ఇద్దరు ఖైదీలు ఓ మాస్టర్ ఫ్లాన్ వేశారు. ఇందుకోసం వారు టూత్ బ్రష్ ని ఆయుధంగా మార్చుకున్నారు. కొద్ది రోజులుగా టూత్ బ్రష్, లోహపు వస్తువు సాయంతో జైలు గోడకు రంధ్రం చేసి అదను చూసి పారిపోయారు. జైలు నుండి ఏడు మైళ్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ హోమ్ ఆఫ్ పాన్‌కేక్స్ (IHOP)అవుట్‌లెట్‌ను సందర్శించాలని కూల్ గా పాన్ కేకులు తినడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత జైలులో ఖైదీలకు అటెండెన్స్ వేస్తున్న సమయంలో ఇద్దరు ఖైదీలు తక్కువ అయ్యారు. చూస్తే గార్జా, నెమో అని తేలింది. అంతే పారిపోయిన ఆ ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో నిందితులను గుర్తించిన రెస్టారెంట్ లోని కస్టమర్లు పోలీసులకు సమాచారం అందించారు.
Viral video : చెట్టు కొమ్మకు వేలాడుతూ మహిళ స్టంట్స్..కొమ్మ విరిగి చివరికి..
హాంప్టన్ పోలీసులు IHOP అవుట్‌లెట్ వద్దకు చేరుకుని ఎటువంటి ప్రమాదం జరగకుండా వారిద్దరినీ అరెస్టు చేశారు. మరోవైపు, టూత్ బ్రష్ తో జైలు గోడకు కన్నం వేసి ఖైదీలు పారిపోయిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు గోడలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండటాన్ని గుర్తించి వెంటనే మరమ్మత్తులు ప్రారంభించారు. ఇక,ఈ ఇద్దరు ఖైదీలు పారిపోయిన ఘటనపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఆ ఇద్దరు ఖైదీలు పాన్ కేక్‌లను తిన్నారా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరొక నెటిజన్.. వారు ఆ ఫుడ్ కి ఎలా చెల్లించాలని ప్లాన్ చేసారు అని వ్యాఖ్యానించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.