హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Harvard professor : అమెరికాలో పుట్టాడు.. చైనా కోసం పనిచేశాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్

Harvard professor : అమెరికాలో పుట్టాడు.. చైనా కోసం పనిచేశాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్

చైనాలో కరోనా పుట్టిల్లయిన వూహాన్ లో అక్కడి (వూహాన్) యూనివర్సిటీ కోసం (అమెరికాలోని) హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు రహస్యంగా పనిచేసినట్లు తేలింది. ఈ విషయాన్ని బుధవారం నాడు అమెరికా అధికారులు నేర నిరూపణ చేశారు. ప్రొఫెసర్ చార్లీకి 26 ఏళ్ల జైలు శిక్ష, 1.2 మిలియన్ డాలర్ల జరిమాన విధించనున్నారు.

ఇంకా చదవండి ...

  అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య ఆధిపత్యపోరు మిగతా ప్రపంచ దేశాలకు టెన్షన్ తెప్పిస్తుంది. ఆ రెండు దేశాలు ఒకరిపై ఒకరు కాలుదువ్వుకునే క్రమంలో మిగతా దేశాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలు ప్రభావితమవుతుండటం తెలసిందే. కరోనా పుట్టుక తర్వాత అమెరికా అధ్యక్షులు.. చైనాను నిందించని రోజంటూలేదు. ట్రంప్ హయాంలో రెండు దేశాలూ ఒక దశలో యుద్ద సైరన్ కూడా మోగించాయి. కరోనా పుట్టుక ముమ్మాటికీ చైనా కుట్రే అని విశ్వసించే అమెరికన్ల సంఖ్య ఇప్పటికీ ఎక్కువే. ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల నడము.. అమెరికాలోనే పుట్టిపెరిగి కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా అత్యున్నత స్థాయికి ఎదిన ఓ పెద్ద మనిషి చీకటి దారుల్లో చైనాకు సహకరించడం, అది కూడా కరోనా మహమ్మారి విషయంలో దేశ భద్రతతో చెలగాటమాడిన తీరు అందరినీ నివ్వెరపరుస్తున్నది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో కెమికల్ బయాలజీ విభాగానికి అధిపతి అయిన ప్రొఫెసర్ చార్లెస్ లైబర్ ఇప్పుడు దోషిగా తేలాడు. అతనికి 26 ఏళ్ల జైలు శిక్ష పడనుంది..

  చైనాలో కరోనా పుట్టిల్లయిన వూహాన్ లో అక్కడి (వూహాన్) యూనివర్సిటీ కోసం (అమెరికాలోని) హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు రహస్యంగా పనిచేసినట్లు తేలింది. ఈ విషయాన్ని బుధవారం నాడు అమెరికా అధికారులు నేర నిరూపణ చేశారు. హార్వర్డ్ వర్సిటీలోని కెమికల్ బయాలజీ డిపార్ట్మెంట్ అధిపతి అయిన ప్రొఫెసర్ చార్లెస్ లైబర్ 2011లో వూహాన్ వర్సిటీకి సైతం పనిచేసినట్లు ఆధారాలతో సహా తేలింది.

  Hyderabad హడలెత్తిస్తోన్న కొత్త వ్యాధి.. ఒక్క గాంధీలోనే 15 కేసులు.. Scrub Typhus వ్యాప్తి ఇలా..

  హార్వర్డ్ ప్రొఫెసర్ చార్లీ.. వూహాన్ వర్సిటీ నుంచి నెలకు 50 వేల డాలర్ల జీతం తీసుకున్నాడని, చైనాలో కొవిడ్ ల్యాబ్స్ ఏర్పాటు, పరిశోధన పత్రాల ప్రచురణకు 1.5మిలియన్ డాలర్లు స్వీకరించాడని అమెరికా అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు, అమెరికా రక్షణ శాఖ, అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నుంచి ప్రొఫెసర్ చార్జీ 15 మిలియన్ డాలర్ల అవార్డును సైతం స్వీకరించారు. అమెరికాలో ఆర్థిక గూఢచర్యం ఆరోపణల కింద ప్రొఫెసర్ చార్లీ అరెస్టయ్యారు.

  USA first covid pill : కరోనా చరిత్రలో మరో మైలురాయి తొలి ట్యాబ్లెట్ Paxlovid‌కు FDA ఆమోదం  అమెరికా హార్వర్డ్ వర్సిటీలో కీలక వ్యక్తిగా ఉంటూ కొవిడ్ ప్రయోగాల విషయంలో చైనా కోసం పనిచేసిననట్లు ప్రొఫెసర్ చార్లీపై మోపిన అభియోగాలు ఆధారాలతో సహా నిరూపితం అయ్యాయి. బుధవారం నాటి తీర్పులో కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. హార్వర్డ్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ద్రోహానికి పాల్పడిన ప్రొఫెసర్ చార్లీకి 26 ఏళ్ల జైలు శిక్ష, 1.2 మిలియన్ డాలర్ల జరిమాన విధించనున్నారు. 2018లో నాటి అధ్యక్షుడు ట్రంప్ హయాంలో.. అమెరికా జరిపిన కొవిడ్ పరిశోధనల డేటాను చైనా దొంగిలించకుండా అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘చైనా ఇనిషియేటివ్’పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంతో సంక్లిష్టంగా ఉండే ఆ దర్యాప్తులోనే ప్రొఫెసర్ చార్లెస్ లైబర్ విద్రోహచర్య వెలుగులోకి వచ్చింది.

  First published:

  Tags: China, Covid, USA

  ఉత్తమ కథలు