Home /News /trending /

US ANGRY THAT THE PAKISTANI PRIME MINISTER IS VISITING RUSSIA AT A TIME WHEN THERE ARE ATTACKS ON UKRAINE SNR

పాక్ ప్రధాని రష్యా పర్యటన వెనుక పరమార్ధం..? అగ్గికి ఆజ్యం పోసేందుకే అంటున్న అమెరికా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

PAK vs US: ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న టైమ్‌లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాస్కో పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్ని ఖండిస్తున్న అగ్రరాజ్యం పాక్‌ వేస్తున్న అడుగులు చూస్తుంటే రష్యా సరసన చేరేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు చేస్తోంది.

ఇంకా చదవండి ...
ఉక్రెయిన్‌(Ukraine), రష్యా( Russia)మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్‌ (Pakistan)వేస్తున్న అడుగులను ప్రపంచ దేశాలు సునిశితంగా గమనిస్తున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan)ఈనెల 23న (February 23rd)రష్యా టూర్‌కి వెళ్లారు. రెండ్రోజుల పర్యటన(2Days)లో భాగంగా ఆయన మాస్కోలో అడుగుపెట్టడంతో అక్కడి విదేశాంగ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఓవైపు రష్యా ఉక్రెయిన్‌పై కయ్యానికి కాలు దువ్వడాన్ని అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యా తీరును వ్యతిరేకిస్తూ ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న సమయంలో రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రష్యాలో అడుగుపెట్టడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. రెండ్రోజుల టూర్‌లో భాగంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Vladimir Putin)తో చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల (Restoration of bilateral relations)పునరుద్ధరణతో పాటు ఇంధన రంగంలో సహకారాన్ని పెంచే విషయంపై పుతిన్‌తో చర్చించనున్నట్లుగా పాకిస్థాన్‌ విదేశాంగశాఖ వెల్లడించింది. వీటితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, అఫ్గానిస్థాన్(Afghanistan)పరిస్థితులపై రష్యా అధ్యక్షుడితో పాక్‌ ప్రధాని చర్చించే అవకాశముందని పేర్కొంది. అయితే రెండు దేశాధినేతల భేటీ వెనుక ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధురణ ఉన్నట్లుగా చెబుతున్నప్పటికి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ మాస్కో వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత అగ్రరాజ్యానికి చెందిన మిలటరీ బేస్‌లను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. అంతే కాదు జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా అందుబాటులోకి రాలేదు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.

పాక్ వక్రబుద్ధి మారదా..
తాజాగా పాకిస్థాన్‌ ఆలోచనలు, ఆ దేశ ప్రధాని వేస్తున్న అడుగులు చూస్తుంటే రష్యాకే తమ మద్దతు ఉందనే సంకేతం ఇచ్చేందుకే పాక్ ప్రధాని రష్యా టూర్‌ని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు రష్యాను దూరం పెడుతుంటే పాక్‌ మాత్రం దగ్గరవ్వలన్న ఆలోచనను తప్పుపడుతున్నాయి మిగిలిన దేశాలు. సుమారు 20సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రష్యాలో అడుగుపెట్టడం ఇదే మొదటి సారి.గతంలో 1999లో పాక్ ప్రీమియర్ ద్వారా మాస్కోను మొదటిసారి సందర్శించారు పాక్ ప్రధాని. తర్వాత ఇన్ని ఏళ్లకు మళ్లీ మాస్కోలో అడుగుపెట్టడం జరిగింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రష్యా, చైనా సరసన పాకిస్థాన్‌ కూడా చేరబోతోందా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి

రష్యా, చైనా జతకు పాకిస్ఖాన్‌ చేరేనా..
ముఖ్యంగా పాకిస్థాన్‌ వ్యవహారశైలిపై అగ్రరాజ్యం అమెరికా మండిపడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి యుద్ధం చేయడంపై తమ వైఖరిని పాకిస్థాన్‌కి తెలియజేశామంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య దౌత్యాన్ని కొనసాగించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను కూడా పాక్‌ దృష్టికి తీసుకెళ్లామంటోంది అమెరికా. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్‌ ప్రధాని రష్యా టూర్‌కి వెళ్లడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోంది అగ్రరాజ్యం. అంతే కాదు ఈ పరిణామాలపై బాధ్యత కలిగిన ప్రతి దేశం రష్యా తీరును ఎండగట్టాలన్న వాదనను అమెరికా గట్టిగా వినిపిస్తోంది. రష్యా టూర్‌కి వెళ్లిన పాక్‌ ప్రధానితో పాటు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ, ఐటీశాఖ మంత్రి, ప్రణాళికశాఖ మంత్రితో పాటు పాక్‌ ఆర్ధిక సలహాదారు, జాతీయ భద్రత సలహాదారు ఉన్నట్లుగా పాక్‌ విదేశాంగశాఖ వెల్లడించింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Joe Biden, Pakistan, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు