మళ్లీ తెరపైకి సోనియా.. నా వల్ల కాదన్న రాహుల్?

సోనియా గాంధీ

Congress Crisis: సోనియానే మళ్లీ రంగంలోకి దించాల్సి వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా పేరును ప్రతిపాదించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

  • Share this:
కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్‌గా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకుంటారని భావించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో.. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాహుల్‌తో భేటీ అయ్యి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. రాహుల్ తగ్గకపోవడంతో.. సోనియానే మళ్లీ రంగంలోకి దించాల్సి వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా పేరును ప్రతిపాదించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లలో మాత్రమే గెలిచింది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ పార్టీకి మరో మూడు సీట్లు కావాలి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా ఎన్నికైన వారే.. పార్లమెంటులో పార్టీ నేతను ఎన్నుకుంటారు. గ‌త లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ నేత‌గా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కొన‌సాగారు. అయితే ఖ‌ర్గే క‌ర్నాట‌క‌లోని గుల్బర్గా నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

sonia gandhi,congress,rahul gandhi,congress parliamentary party,congress parliamentary party meeting,upa chairperson sonia gandhi,congress president rahul gandhi,rahul gandhi latest news,priyanka gandhi as congress general secretary,priyanka gandhi,rahul gandhi resignation,rahul gandhi resigns,leader of congress,rahul gandhi news,sonia gandhi after election results,rahul gandhi at congress meet, సోనియాగాంధీ, సోనియా, రాహుల్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ
సోనియాకు శుభాకాంక్షలు చెబుతున్న మన్మోహన్


ఇదిలా ఉండగా, 1999లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా సంక్షోభాన్ని ఎదుర్కొంది. సోనియాగాంధీ విదేశీ మహిళ అని, ఆమె పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించడాన్ని ఒప్పకోబోమని పార్టీ సీనియర్‌ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ స్పష్టం చేశారు. దీంతో సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సోనియా సారథ్యాన్ని వ్యతిరేకించిన శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పీఏ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో నిలిచారు.
First published: