హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదేనా క్రీడాకారులకు గౌరవం : యూపీలో కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్ గదిలో అన్నం..వైరల్ వీడియో

ఇదేనా క్రీడాకారులకు గౌరవం : యూపీలో కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్ గదిలో అన్నం..వైరల్ వీడియో

కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్ గదిలో అన్నం

కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్ గదిలో అన్నం

Sportspersons Served Food  Kept In Toilet : మన దేశంలో క్రీడాకారులకు(Sportspersons) ఇచ్చే గౌరవం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క్రీడాకారులకు ఇక సరైన సౌకర్యాలు కల్పించడం అంటే సరే సరి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Sportspersons Served Food  Kept In Toilet : మన దేశంలో క్రీడాకారులకు(Sportspersons) ఇచ్చే గౌరవం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క్రీడాకారులకు ఇక సరైన సౌకర్యాలు కల్పించడం అంటే సరే సరి. క్రీడాకారులు క్రీడల్లో రాణించేందుకు మేం అది చేస్తున్నాం..ఇది చేస్తున్నాం అని కోటలు దాటే మాటలు చెబుతారు మన నేతలు. కానీ గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే మన క్రీడాకారులకు మన నేతలు కల్పిస్తున్న అద్భుతమైన సౌకర్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంత అద్భుతమైన సౌకర్యాలు ఏంటివంటే..టాయిలెట్ గదిలోనే ఫుట్ బాల్ ప్లేయర్లకు భోజన వసతి ఏర్పాటు చేయడమే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహారన్‌పూర్‌(Saharanpur)లో గత వారం అండర్‌-17 రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ టోర్నమెంట్‌(U17 Kabaddi Tournament For Girls) జరిగింది. ఆ సమయంలో టాయిలెట్ గదుల్లో భద్రపర్చిన ఆహారాన్ని క్రీడాకారులు వడ్డించుకున్నారు. సెప్టెంబర్‌ 16వ తేదీన కొందరు క్రీడాకారులే ఈ దుస్థితిని వీడియోలు తీసి బయటకు రిలీజ్‌ చేయడంతో విషయం బయటికొచ్చింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఓ వీడియోలో...టాయ్‌లెట్‌లో ఓ పక్కన ఉన్న పాత్రల నుంచి అన్నం, కూరలతో పాటు అక్కడి నేలపై ఓ పేపర్‌ ముక్కపై నుంచి పూరీలను క్రీడాకారులు వడ్డించుకుంటున్నారు. ఆ భోజనాన్ని ప్లేట్ లో పెట్టుకుని బయటకు వెళ్లి తింటున్నారు. మరో వీడియోలో పనివారు టాయిలెట్ లోని పాత్రలను తీసుకొని ఆహారం వండుతున్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకువస్తున్నట్లు కనబడింది. . కబడ్డీ ఆటగాళ్ల కోసం మరుగుదొడ్డిలో ఆహారాన్ని భద్రపర్చడం, గత్యంతరం లేని స్థితిలో అక్కడే వాళ్లు వడ్డించుకోవడం లాంటి ఘోర పరిస్థితులతో ఉన్న వీడియో వైరల్‌ కావడం యూపీలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోలు తీవ్ర దుమారం రేపి విమర్శలు వెల్లువెత్తడంతో షహరన్‌పూర్‌ క్రీడాధికారి అనిమేష్‌ సక్సేనా స్పందించారు. స్టేడియం వద్ద నిర్మాణ పనులు సాగుతున్నాయి... పైగా ఆ సమయంలో వర్షం పడింది... అందుకే స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద వంటలు చేయించాం..అయితే ఆహారాన్ని భద్రపరిచింది బట్టలు మార్చుకునే రూంలో అని ఆయన వెల్లడించారు. టాయిలెట్ లో ఆహారాన్ని ఉంచిన ఆరోపణలను ఆయన ఖండించారు. వైరల్ వీడియోల వివాదం నేపథ్యంలో షహరాన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి.. నిత్యపూజలు చేస్తున్న వ్యక్తి.. ఎందుకంటే..

ఈ ఘటనపై షహరన్‌పూర్‌ జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ మాట్లాడుతూ...ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్ చేశారు. నేను విచారణకు ఆదేశించాను. సంబంధిత వ్యక్తి మూడు రోజుల్లో నివేదికను సమర్పిస్తాను. మేము తగిన చర్యలు తీసుకుంటాము"అని తెలిపారు. కబడ్డీ ఆటగాళ్లను అగౌరవపర్చారంటూ పలు రాజకీయ పార్టీలు అధికార బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. వివిధ ప్రచారాలకు బీజేపీ కోట్లకు కోట్లు ఖర్చుపెడుతుంది కానీ ఆటగాళ్లకు సరైన ఏర్పాట్లు చేసేందుకు మాత్రం డబ్బు లేదు అని కాంగ్రెస్ హిందీలో ట్వీట్ చేసింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు