Home /News /trending /

సీఎం పెంపుడు కుక్క.. ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీ

సీఎం పెంపుడు కుక్క.. ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీ

పెంపుడు కుక్కతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

పెంపుడు కుక్కతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్‌ ఇష్టపడే ఈ కుక్క పూర్తి శాఖాహారి. ఆలయంలో తయారు చేసే పాలు, చపాతీలు, అన్నం లాంటివి తింటుంది.

    ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పెంపుడు కుక్క ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కుక్కకు ఆహారం తినిపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. లాబ్రడార్ జాతికి చెందిన ఈ నల్ల రంగు కుక్క యోగి ఆదిత్యనాథ్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందనే వాదన కూడా ఉంది. ఈ కుక్క పేరు ‘కాలు.’ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఎప్పుడొచ్చినా.. ఈ కుక్క ఆయన మీద పడి ప్రేమను చూపుతుంది. తన ఆనందాన్ని తెలియజేస్తుంది. కాలు కుక్కకి సీఎం యోగి ఆదిత్యనాథ్ పనీర్ తినిపిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. దీనిపై గోరఖ్‌పూర్‌లోని గోరక్ష్ ఇంచార్జ్ మాట్లాడుతూ... యోగి ఆదిత్యనాథ్‌కు ఈ కుక్క అంటే ఎంతో అభిమానమని చెప్పారు.

    ‘2016 డిసెంబర్‌లో కాలుని తీసుకొచ్చారు. యోగికి ఢిల్లీలో ఎవరో ఓ ఆలయ భక్తుడు ఈ కుక్కని కానుకగా ఇచ్చాడు. అది కొన్నాళ్లు హస్తినలోనే ఉంది. దాన్ని తీసుకొచ్చిన మూడు నెలల్లోనే మార్చి 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు యోగిజీ వద్ద రాజా బాబు అనే కుక్క ఉండేది. అది చనిపోయినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డారు.’ అని గోరక్ష్ ఇంచార్జ్ తివారీ తెలిపారు.

    యోగి ఆదిత్యనాథ్‌ ఇష్టపడే ఈ కుక్క పూర్తి శాఖాహారి. ఆలయంలో తయారు చేసే పాలు, చపాతీలు, అన్నం లాంటివి తింటుంది. యోగి ఆదిత్యనాథ్ లేని సమయంలో ఆయన సహాయకుడు హిమాలయగిరి ఈ కుక్క బాధ్యతలు చూస్తుంటారు. కుక్కకి ఎలాంటి వ్యాధులు సోకకుండా, వాతావరణం నుంచి రక్షణ కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
    First published:

    Tags: Uttar pradesh, Yogi adityanath

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు