రిక్షాలో అమ్మాయికి.. అపరిచితుడి ముద్దు... రగిలిపోతున్న నెటిజన్లు

రిక్షాలో అమ్మాయికి.. అపరిచితుడి ముద్దు (image credit - twitter)

మనం తాలిబన్ల అరాచకాల గురించి మాట్లాడుకుంటున్నాం. మన దేశానికి పక్కనే ఓ దేశంలో జరుగుతున్న అరాచకాలు ఎన్నో. వాటిలో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ రేపుతోంది.

 • Share this:
  అది పాకిస్థాన్‌లోని ఓ ఏరియా. అక్కడ ఎడ్ల బండి లాంటి ఓ రిక్షాలో... ఇద్దరు అమ్మాయిలు... ఓ చిన్నారి కూర్చొని వెళ్తున్నారు. రాత్రి సమయం. ఆ ఏరియాలో చాలా మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి... తమకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆ అమ్మాయిలు అనుకొని ఉంటారు. కానీ... జనాల్లోంచీ వచ్చిన ఒకడు... వేగంగా వెళ్లి రిక్షా ఎక్కి... బల్లిలా అతుక్కుపోయి... ఓ అమ్మాయికి బుగ్గపై ముద్దు పెట్టేశాడు. (Man Kissed Unknown Girl in Rickshaw) ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి పారిపోయాడు. అనూహ్య ఘటనతో బాధితురాలు, ఆ పక్కనే ఉన్న మరో యువతి ఆశ్చర్యపోయారు. ఇంత దారుణమా అనుకున్నారు. అప్పుడే అయిపోలేదు.

  పక్క నున్న యువతి జోలికి వచ్చేందుకు మరొకరు ప్రయత్నించగా... ఆమె చెప్పు తీయడంతో... దుండగులు పారిపోయారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. (Pakistan Viral Video)

  ఆ వీడియోని ఇక్కడ చూడండి.


  ముద్దు పెట్టే ముందు... ఆ యువకుడు అసభ్య సంకేతాలు చేశాడనీ... అందువల్లే ఆ యువతులు... తలలు మరోవైపు తిప్పుకొని ఉన్నారని తెలిసింది. అలా వారు తలలు వేరే వైపు తిప్పుకున్నప్పుడే ఆ యువకుడు రిక్షా దగ్గరకు వెళ్లి అంత పని చేశాడు. ఇదంతా పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న ఆగస్ట్ 14నే జరిగింది.


  ఈమధ్యే ఇలాంటి మరో ఘటన కూడా జరిగింది. అందులో ఓ గుంపు... ఓ యువతి బట్టలు చింపి గాల్లోకి విసిరారు. ఆ తర్వాత ఆమెను రేప్ చెయ్యబోయారు. ఆ ఘటన తీవ్ర దుమారం రేపడంతో... దానిపై దర్యాప్తుకి ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు.


  ఇప్పుడీ వీడియో వీర వైరల్ అవుతోంది. చాలా మంది ఇది చూసి పాకిస్థాన్ ప్రభుత్వంపై భగ్గు మంటున్నారు. అక్కడ అమ్మాయిలకు రక్షణ లేదని ఫైర్ అవుతున్నారు. మరికొందరైతే... ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకూ... పాకిస్థాన్‌లో పరిస్థితులకూ తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు.

  ఇది కూడా చదవండి: భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసిన భర్త.. ఆ తర్వాత హైడ్రామా.!

  దేశంలో లా అండ్ ఆర్డర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ది మొదటి నుంచి మెతకవైఖరే. ఫలితంగానే పాకిస్థాన్ ఇలా ఏడ్చింది. ఇది మచ్చుక్కి ఒక్క ఘటన మాత్రమే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: