కొందరు విద్యార్థులు చదువుకునే రోజుల్లోనే తప్పటడుగులు వేస్తుంటారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వారిపై డబ్బులు ఖర్చుచేసి చదువు కొవడానికి పంపుతారు. కానీ వారు బాయ్ ఫ్రెండ్, జల్సాలు అంటూ అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు. ఇంట్లో లేని ఫ్రీడమ్ దొరకడంతో విచ్చల విడిగా ప్రవర్తిస్తుంటారు. దీన్ని కొంత మంది అబ్బాయిలు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. దీంతో జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు జరుగుతుంటాయి. ఇప్పటికే చదువుకునే విద్యార్థులు తప్పటడుగులు వేయడం వలన ప్రెగ్నెంట్ అయిన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. మరో వెరైటీ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. యూకేలోని (University Student In UK) సౌతాంప్టన్ యూనివర్సీటిలో వింత ఘటన వెలుగులోనికి వచ్చింది. 20 ఏళ్ల జెస్ డేవిస్ అనే విద్యార్థిని హిస్టరీ, పొలిటిక్స్ విభాగంలో.. యూనివర్సీటిలో రెండో సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో.. జూన్ 11న ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. ఆమెకు పీరియడ్స్ సరిగ్గా రావు. దీంతో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంది. అయితే.. ఆమెకు కడుపులో భరింలేని నొప్పి రావడంతొ బాత్రూమ్ కు వెళ్లింది. అప్పుడు అక్కడ షాకింగ్ ఘటన జరిగింది.
ఆమె.. స్త్రీ జననాంగం నుంచి ఏదో బయటకు వచ్చింది. టాయ్ లేట్ లో.. ఏదో పడినట్లు ఆమె గుర్తించింది. అక్కడ బాలుడి ఏడ్పు విన్పించింది. వెంటనే చేసే సరికి చిన్న పిల్లవాడు ఉన్నాడు. వెంటనే ఆమె తన ఇంట్లో వారికి, స్నేహితులకు కాల్ చేసి చెప్పింది. తనకు ఎలాంటి ప్రెగ్నెన్సీ సిప్టమ్స్ కానీ, బేబీ బంప్ కానీ లేవు. ఇలా ఏవిధంగా జరిగిందని ఆమె తలలు పట్టుకుంది. వెంటనే బేబీ, తల్లిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు బేబీ బాయ్.. తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. శిశువు మూడు కేజీల బరువును కల్గి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media) వైరల్ గా మారింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home delivery, United Kingdom, VIRAL NEWS, WOMAN