Home /News /trending /

UNITED KINGDOM MAN REUNITED WITH PHONE HE ACCIDENTALLY DROPPED INTO RIVER 11 MONTHS AGO PAH

నదిలో పడిపోయిన ఐఫోన్.. ఏడాది తర్వాత దొరికింది... చార్జింగ్ పెడితే ఏం జరిగిందో తెలుసా..?

ఫోన్ పొగొట్టుకున్న జంట

ఫోన్ పొగొట్టుకున్న జంట

United kingdom: ఏడాది క్రితం కాబోయే భార్యతో బోటులో షికారుకు వెళ్లాడు. ఇద్దరు ఆనందంగా గడిపారు. ఈ క్రమంలో సెల్ఫీలు దిగాలనుకున్నారు. సదరు వ్యక్తి తన వెనుక జేబులో ఐఫోన్ పెట్టుకున్నాడు.

కొందరు కొన్ని వస్తువులను తమ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఒక్క నిముషం కూడా దాన్ని వదిలిపెట్టి ఉండరు. పొరపాటున ఆ వస్తువు కనపడక పోతే విలవిల్లాడి పోతుంటారు. దాని కోసం ఎమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం తరచుగా కొందరికి కొన్ని వస్తువులను సర్ ప్రైజ్ గా గిఫ్ట్ లు ఇవ్వడం మనకు తెలిసిందే. దీన్ని ఇచ్చే వారు ఎంతో ప్రేమతో ఇస్తారు. తీసుకున్న వారు కూడా.. అంతే ఎమోషనల్ గా దాన్ని చూసుకుంటారు. అది పోయినప్పుడు.. తమ జీవితంలో ఎదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. దానికోసం ఎంత కాలమైన వెతుకుతుంటారు. ఇక దొకదనుకున్న వస్తువు.. తిరిగి దొరికితే వారి ఆనందానికి హద్దులే ఉండవు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు... యూకేలో (United kingdom) ఈ ఘటన జరిగింది. మిఘుల్ పఛెకో వై అనే వ్యక్తి స్థానికంగా ఉన్న నదిలో ఉన్నప్పుడు ఒక ఐఫోన్ దొరికింది. దాన్ని అతగాడు.. ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత.. దాన్ని శుభ్రం చేశాడు. దాన్ని తన చార్జర్ తో పెట్టి చూశాడు. అయితే , అప్పుడు అనుకొని సంఘటన జరిగింది. నీళ్లలో పడినాకూడా మొబైల్ చార్జింగ్ (Iphone) నిండింది. ఈ క్రమంలో.. దానిపై స్క్రీన్ పై ఫోటో ఉంది. అతను దాన్ని పొగొట్టుకున్న వారికి ఇవ్వాలని అనుకున్నాడు. దీని కోసం.. ఫోన్ మీద ఉన్న ఫోటోను తీసి.. సోషల్ మీడియాలో  (Social  media) షేర్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది.



ఈ క్రమంలో యూకేలోని ఎడిన్ బర్గ్ కు ఫోన్ పొగొట్టుకున్న వ్యక్తులు ఆ పోస్ట్ ను చూశారు. ఇంటర్ నెట్ లో.. షేర్ చేసిన ఫోటోను ఫోన్ యజమాని ఓవైన్ డేవిస్, అతని కాబోయే భార్య ఫియోనా గార్డనర్ గా స్నేహితులు గుర్తించారు. వీరిద్దరు పడవ మీద నదిలోకి సరదాగా వెళ్లినప్పుడు ఫోన్ అనుకొకుండా నీటిలో పడిపోయింది. (Dropped Into River)  వెంటనే వారికి సమాచారం అందించారు. ఓవైన్ డేవిస్ , ఫోన్ లో సంప్రదించగా.. మిస్టర్ పఛేకో వారే ఫోన్ ను పొగొట్టుకున్న జంటగా గుర్తించారు. వెంటనే వారు సూచించిన అడ్రస్ కు ఫోన్ కు పంపాడు. అసలు .. దొరకదనుకున్న తన ఫోన్ తిరిగి దొరకడంతో అతగాడి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media) తెగ వైరల్ గా (viral news)  మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Iphone, United Kingdom, VIRAL NEWS, Water

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు