Aadhaar Seva Kendra: హైదరాబాదీలకు గుడ్ న్యూస్... తొలి ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు

Aadhaar Seva Kendra | హైదరాబాద్‌లో స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లతో పాటు 236 బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బీఎస్ఎన్ఎల్ కేంద్రాల్లో పౌరులకు ఆధార్ సేవలు లభిస్తున్నాయి. వీటితో పాటు మాదాపూర్‌లోని ఆధార్ సేవా కేంద్రం పౌరులకు అందుబాటులోకి వచ్చింది.

news18-telugu
Updated: November 1, 2019, 11:16 AM IST
Aadhaar Seva Kendra: హైదరాబాదీలకు గుడ్ న్యూస్... తొలి ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు
Aadhaar Seva Kendra: హైదరాబాదీలకు గుడ్ న్యూస్... తొలి ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీకు ఆధార్ సేవలు అవసరమైతే దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్తుంటారు కదా? స్థానికంగా సేవలు అందించే ఆధార్ సెంటర్లతో పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేకంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటైంది. ఇక దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధార్ సేవ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ వాసుల కోసం తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోనే తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది UIDAI. ఇప్పటికే హైదరాబాద్‌లో స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లతో పాటు 236 బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, బీఎస్ఎన్ఎల్ కేంద్రాల్లో పౌరులకు ఆధార్ సేవలు లభిస్తున్నాయి. వీటితో పాటు మాదాపూర్‌లోని ఆధార్ సేవా కేంద్రం పౌరులకు అందుబాటులోకి వచ్చింది.

మాదాపూర్‌లోని విఠల్ రావు నగర్‌లో రిలయెన్స్ సైబర్ విల్లాలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది UIDAI. వారంలో 7 రోజులు ఈ ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది. రోజుకు 1000 మందికి సేవలు పొందొచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆధార్ సేవా కేంద్రం పనిచేస్తుంది. ఎన్‌రోల్‌మెంట్ ఫీజు రూ.50. ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ సేవలు పొందాలనుకునేవారు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. https://ask.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకునేందుకు ఇక్క డ క్లిక్ చేయండి.




స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లో లభించే సేవలన్నీ ఆధార్ సేవా కేంద్రాల్లో లభిస్తాయి. పాస్‌పోర్ట్ తరహాలో ఆధార్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అయితే ఆధార్ సెంటర్లతో పోలిస్తే ఆధార్ సేవా కేంద్రాల్లోనే సేవలు ఎక్కువగా, వేగంగా లభిస్తాయి. 2019 డిసెంబర్ చివరి నాటికి దేశంలో 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే యూఐడీఏఐ లక్ష్యం. ఇందుకోసం రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది యూఐడీఏఐ. భారతదేశంలోని ఇప్పటివరకు 17 ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఆధార్ సేవా కేంద్రం విజయవాడలో ఉండగా, హైదరాబాద్‌లో ఆధార్ సేవ కేంద్రం మాదాపూర్‌లో ఉంది.

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Aadhaar Door Service: ఇక మీ ఇంటి దగ్గరే ఆధార్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి

Aadhaar: ఆధార్ సేవల కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుకింగ్ ఇలా...

IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేయండి... ఈ లాభాలు పొందండి
Published by: Santhosh Kumar S
First published: November 1, 2019, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading