UNIQUE AND WEIRD WAYS OF BURIAL INDONESIAN PEOPLE BURIES CHILDREN BODY INSIDE TREE TRUNK SK
OMG: పిల్లలు చనిపోతే చెట్లుగా మారుతారు... తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు.. ఈ వింత సంప్రదాయం గురించి మీకు తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Dead Body Buries In Tree Trunk: ఇండోనేసియా(Indonesia)లోని ఓ తెగ మాత్రం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఇక్కడ ఎవరైనా పిల్లలు మరణిస్తే.. వారిని ఖననం చేయరు. దహనం కూడా చేయరు. చెట్టు తొర్రల్లో ఉంచుతారు.
ప్రపంచంలో వందలాది దేశాలు.. వేలాది తెగల ప్రజలు ఉన్నారు. ఈ భూమిపై అనేక సంప్రదాయాలు, ఆచారాలను విశ్వసించే వ్యక్తులు ఉన్నారు. ఒక్కో మతంలో ఒక్కోరకమైన ఆచార వ్యవహరాలను పాటిస్తారు. ఐతే ఇందులో కొన్ని సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇతరులతో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా చనిపోతే.. సమాధుల్లో పూడ్చిపెడతారు. లేదంటే దహనం చేస్తారు. కానీ ఇండోనేసియా(Indonesia)లోని ఓ తెగ మాత్రం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఇక్కడ ఎవరైనా పిల్లలు మరణిస్తే.. వారిని ఖననం చేయరు. దహనం కూడా చేయరు. చెట్టు తొర్రల్లో ఉంచుతారు. చిన్నపిల్లల మృతదేహాలను చెట్టు లోపల పాతి పెట్టే (Dead Body Buries In Tree Trunk) సంప్రదాయాన్ని ఎన్నో ఏళ్లుగా.. అక్కడి ప్రజలు పాటిస్తున్నారు.
ఇండోనేషియాలోని తానా తరోజా (Tana Toraja) తెగ ప్రజలు ఈ విచిత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పెద్ద వారు మరణిస్తే.. సాధారణ పద్దతిలోనే అంత్యక్రియలు జరుగుతాయి. కానీ పిల్లల విషయంలో మాత్రం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తారు. పిల్లల చనిపోతే తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేనిది. చిన్నారుల మరణం.. కన్నవారిలో అంతులేని దు:ఖాన్ని మిగుల్చుతుంది. ఈ నేపథ్యంలో తానా తరోజా ప్రజలు తమ బిడ్డలను ప్రకృతిలో కలిపే సంప్రదాయాన్ని పాటిస్తారు. మరణించిన వారిని చెట్టులో కలిపేస్తారు. పెద్ద పెద్ద చెట్లుకు కన్నం పెట్టి.. కాండం తొలగిస్తారు. తొర్రలను ఏర్పాటు చేసి.. అందులో పిల్లలను ఖననం చేస్తారు. అనంతరం ఆ చెట్టునే తమ బిడ్డగా భావిస్తారు. చెట్టు భూమిపై ఉన్నంత కాలం..తమ పిల్లలు కూడా తమతోనే ఉన్నారని భావిస్తారు. దేవుడు తమ బిడ్డలను దూరం చేసినప్పటికీ.. చెట్టు రూపంలో తమ వద్దే ఉంటారని విశ్వసిస్తారు. ఆ చెట్టును ఎంతో ప్రేమంగా చూసుకుంటారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇలాంటి విచిత్ర సంప్రదాయాలను పాటిస్తున్నారు. టిబెట్, మంగోలియా ప్రాంతాల ప్రజలు చనిపోయిన వారి మృతదేహాన్ని చెట్లపై ఉంచుతారు. శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి పర్వతంపైన లేదంటే చెట్టుపై వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ త్వరగా స్వర్గ ద్వారాలకు చేరుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. పార్సీ సమాజంలోని ప్రజలు శవాలను రాబంధులకు ఆహారంగా విసిరేస్తారు. ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహానికి స్నానం చేయించి.. తమ ప్రార్థనా స్థలం వద్ద విసిరేస్తారు. ఆ తర్వాత రాబందులు వచ్చి శవాన్ని పీక్కు తింటాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత.. వారి ఆత్మ ఖచ్చితంగా తన శరీరాన్ని విడిచిపెట్టాలి. రాబందులు ఈ విషయంలో మానవులకు సహాయం చేస్తాయని వారు నమ్ముతారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.