Home /News /trending /

UNIQUE AND VARIETY RAILWAY STATIONS IN INDIA KNOW EVERYTHING ABOUT THEM HERE IS INTERESTING STORY SK

Unique Railway Stations: మనదేశంలో విచిత్ర రైల్వే స్టేషన్లు.. ఇలాంటివి ఎక్కడా ఉండవు.. వాటి ప్రత్యేకతలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Unique Railway stations: మన దేశంలో కొన్ని రైల్వే స్టేషన్‌లకు విచిత్రమైన పేర్లున్నాయి. మరికొన్నింటికి పేర్లే లేవు. పలు రైల్వే స్టేషన్‌లు రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. మరి ఆ స్టేషన్‌లేంటి..?

  రైలు ప్రయాణాలంటే(Train Journey) చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు.. రైళ్లలో వెళ్లేందుకే మొగ్గుచూపుతారు. ఎందుకంటే రైల్వేలో తక్కువ ధరకే.. చాలా సౌకర్యవంతం, సురక్షితంగాగా ప్రయాణించవచ్చు. స్లీపర్ క్లాస్‌లో నిద్రపోతూ.. బోర్ కొట్టినప్పుడు కిటికీల గుండా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఏ మాత్రం అలసట లేకుండా గమ్యానికి చేరుకోవచ్చు. ఐతే ఇండియన్ రైల్వే (India Railways)కు సంబంధించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని రైల్వే స్టేషన్‌లకు విచిత్రమైన పేర్లున్నాయి. మరికొన్నింటికి పేర్లే లేవు. పలు రైల్వే స్టేషన్‌లు రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. మరి ఆ స్టేషన్‌లేంటి. వాటి ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

  బ్రా సైజ్‌పై నటి కాంట్రవర్సీ కామెంట్..శ్వేతాతివారీకి అంత కొవ్వెందుకు..

  భవానీ మండి రైల్వే స్టేషన్ (Bhawani mandi Railway station)
  ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాలకు చెందినది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌లో ఏదైనా రైలు ఆగితే.. దాని ఇంజిన్ రాజస్థాన్‌లో, బోగీలు మధ్యప్రదేశ్‌లో ఉంటాయి. భవానీ మండి రైల్వే స్టేషన్‌కి ఒక చివర రాజస్థాన్ బోర్డు, మరొక చివర మధ్యప్రదేశ్ బోర్డు ఏర్పాటు చేశారు.

  అట్టారి రైల్వే స్టేషన్ (Attari Railway station)
  అట్టారి రైల్వే స్టేషన్‌లో మన దేశంలో వీసా అవసరం ఉన్న ఏకైక రైల్వే స్టేషన్. భారతదేశంలో ఉన్న అట్టారీ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే మీకు పాకిస్తాన్ వీసా ఖచ్చితంగా ఉండాలలి. వీసా లేకుంటే జైలు శిక్ష విధించవచ్చు. ఇండో-పాక్ సరిహద్దులో ఉన్న అమృత్‌సర్‌లోని అట్టారి రైల్వే స్టేషన్ ఎల్లప్పుడూ భద్రతా బలగాల కఠినమైన పర్యవేక్షణలో ఉంటుంది.

  ఢిల్లీలో లేడీ కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. చేసింది ఆడవాళ్లే ఎందుకో తెలుసా

  నవాపూర్ రైల్వే స్టేషన్ (Nawapur Railway station)
  నవాపూర్ రైల్వే స్టేషన్.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఈ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన బెంచ్‌పై సగం మహారాష్ట్ర , సగం గుజరాత్ అని రాసి ఉంటుంది. నవపూర్‌లో హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ వంటి వివిధ భాషలలో రైల్వే ప్రకటనలు చేస్తారు. మహారాష్ట్ర, గుజరాత్‌లు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ నవపూర్ స్టేషన్ ఏర్పడింది.

  టెర్మినస్ స్టేషన్ (Terminus Station)
  ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతీయ రైల్వేలోనే అతిపెద్ద టెర్మినస్. సాధారంగా మన దేశంలో రైలు ప్రయాణాలు కోల్‌కతాలోని హౌరా టెర్మినల్, ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్, విక్టోరియా టెర్మినల్, బాంద్రా టెర్మినల్, భావ్‌నగర్ టెర్మినల్, కొచ్చిన్ హార్బర్ టెర్మినస్‌ల్లో ముగుస్తాయి. అంటే అదే ఆఖరు స్టాప్. ఒక నిర్దిష్ట రైలు మార్గంలోని చివరి స్టాప్‌ను టెర్మినస్ అంటారు. టెర్మినల్ అనే పదం ఆంగ్ల పదం టెర్మినేషన్ నుండి వచ్చింది. దీని అర్థం ముగింపు.

  OMG: తన పీరియడ్స్ రక్తాన్ని తాగుతున్న మహిళ.. ముఖానికీ ఫేసియల్.. ఎన్నో

  పేరులేని స్టేషన్ (Nameless Stations)
  సాధారణంగా ప్రతి రైల్వే స్టేషన్‌కు ఏదో ఒక పేరు ఉంటుంద. కానీ మన దేశంలో పలు రైల్వే స్టేషన్‌లకు పేరు లేదు. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాలో బంకురా-మస్‌గ్రామ్ రైలు మార్గంలో ఉంది. దీనిని 2008లో నిర్మించారు. ఈ స్టేషన్‌కు మొదట రాయ్‌నగర్ అని పేరు పెట్టారు. కానీ పక్కనే ఉన్న రైనా గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఆ పేరును తొలగించారు. మా ఊరి పేరునే పెట్టాలని రెండు గ్రామాల ప్రజలు కొట్టాడుతున్న నేపథ్యంలో ఆ స్టేషన్‌కు ఏ పేరూ పెట్టకుండా అలానే ఉంచారు. జార్ఖండ్‌లో కూడా ఇలాంటి స్టేషన్ ఉంది. రాంచీ నుంచి టోరీకి వెళ్లే రైలు.. పేరు లే ఓ ని స్టేషన్ గుండా వెళతాయి. దీనికి బడ్కిచంపి అని పేరు పెట్టాలని రైల్వేశాఖ మొదట భావించింది. కానీ కమ్లే గ్రామ ప్రజలు వ్యతిరేకించడంతో ఎలాంటి పేరు పెట్టలేదు.

  విచిత్ర పేర్లు (Variety station names)
  రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్‌లో ఒక స్టేషన్ ఉంది. దాని పేరు బాప్ (హిందీలో తండ్రి). ఈ స్టేషన్ కోడ్ BAF. బాప్ అని పిలుస్తారు. ఇక మహారాష్ట్రలోని బేలాపూర్ రైల్వే స్టేషన్ కోడ్ కూడా బాపే. జైపూర్ డివిజన్‌లో ఉన్న ఒక రైల్వే స్టేషన్ పేరు సాలి ( హిందీలో మరదలు). నానా (తాత) స్టేషన్ రాజస్థాన్‌లోని సిరోహి పింద్వారా అనే ప్రదేశంలో ఉంది. కాలా బక్రా (నల్ల మేక) రైల్వే స్టేషన్ జలంధర్‌లోని ఒక గ్రామంలో ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Indian Railways, IRCTC, Railway station

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు