UNION MINISTER KIREN RIJIJU SINGING FOR INDIAN ARMY SOLDIERS VIDEO GETTING VIRAL HSN GH
Kiren Rijiju: పాట పాడిన కేంద్ర మంత్రి.. అలనాటి మధుర గీతంతో సైనికుల్లో జోష్.. వీడియో వైరల్
పాట పాడుతున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
సాధారణంగా కేంద్ర మంత్రులంటే ఎలా ఉంటారు.. ప్రోగ్రాం కోసం వస్తారు.. తాము చేయాల్సిన పని కొన్ని నిమిషాలపాటు చేసి.. వెళ్లిపోతారు అంతే కానీ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాత్రం అందుకు అతీతం. తాజాగా ఆయన చేసిన ఓ అరుదైన ఫీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నేను సింగర్ ను కాను.. కానీ భారత సైనికుల కోసం నేను సగర్వంగా పాట పాడుతున్నా అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాట పాడటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆన్లైన్లో మంత్రి చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతేనా.. ఇంకా , వ్యూస్, లైకులు, షేర్లు, కామెంట్ల వరద వచ్చిపడుతోంది కూడా. 100K కామెంట్లు సంపాదించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. అధికారిక కార్యక్రమంలో పాల్గొని, పాటపాడిన కేంద్ర మంత్రి సైనికుల్లో ఒకడిగా కలిసిపోవటం సైనిక కుటుంబాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మరోవైపు ఆయనే స్వయంగా ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన ఆయన సైనికులతో భలే కలిసిపోయారు. అంతేకాదు వారితో తాను దిగిన ఫొటోలను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంజినీర్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సమావేశంలో రిజిజు పాల్గొని ఇలా సైనికుల్లో నయా జోష్ నింపటం హైలైట్. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్లో ఎవరైనా ఆయన్ను ఏదైనా అడిగితే తక్షణం స్పందిస్తారు.
I'm not a singer but I proudly sang for our brave jawans!
I had a memorable evening with the personnel of 62 Engineer Regiment of Indian Army after a visit to border to see roads and other infrastructure with DG BRO. pic.twitter.com/zLZNC4o2MF
క్లాసిక్ మూవీ నుంచి క్లాసిక్ సాంగ్..
1973 లో వచ్చిన ‘ధుంఢ్’ అనే చిత్రం నుంచి ‘సంసార్ కి హర్..’ అన్న పాటను వేదికపై పాడారు. "ధుంఢ్" అనే క్లాసిక్ బాలీవుడ్ సినిమాలో సంజన్ ఖాన్, జీనత్ అమన్, డానీ నటించారు. ఈ సినిమాలోని హిట్ నంబర్ తో సైనికుల మనసు దోచుకున్న కిరణ్ రిజుజు స్వతహాగా మంచి గాయకులు. కేంద్ర మంత్రి తన పాటతో జవాన్ల మనసు దోచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కేంద్ర మంత్రి పాట వైరల్ అవుతోంది. ఇక స్పోర్ట్స్ మ్యాన్, అథ్లెటిక్ కూడా అయిన కిరణ్ చాలా యాక్టివ్ గా ఉండే కేంద్ర మంత్రుల్లో ముందు వరుసలో ఉంటారు.
అంతేనా ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఈయన ఎప్పటికప్పుడు ఫిట్నెస్ కు సంబంధించిన చాలెంజులు స్వీకరిస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఈయన దేశవ్యాప్తంగా ఏం జరిగినా తక్షణం స్పందించే మంత్రిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. సైక్లింగ్, క్రికెట్, ఇతర క్రీడలతోపాటు బాలీవుడ్, ఫుడ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు వంటివి తన ఫేవరెట్ అని చెప్పుకునే కిరణ్ ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది.