హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఫోటో గ్రాఫర్ ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రి.. అసలేం జరిగిందంటే..

ఫోటో గ్రాఫర్ ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రి.. అసలేం జరిగిందంటే..

జర్నలిస్ట్ కు సపర్యలు చేస్తున్న కేంద్ర మంత్రి

జర్నలిస్ట్ కు సపర్యలు చేస్తున్న కేంద్ర మంత్రి

Delhi: కేంద్ర మంత్రి భగవత్ కరాద్ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అక్కడ అనేక మంది మీడియా మిత్రులు, ఫోటో గ్రాఫర్ లు ఉన్నారు. ఇంతలో ఒక ఫోటో గ్రాఫర్ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడ్డాడు.

కొందరు హోదా లో ఎంత ఉన్నత స్థానానికి వెళ్లిన ఒదిగే ఉంటారు. అవకాశం దొరికిన ప్రతిసారి ప్రజలతో కలవడానికి ఇష్టపడుతుంటారు. వారికి తమ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధాన్నికల్గి ఉంటారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు. వారికి సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తమ డబ్బుని, దర్పాన్ని చూపించరు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi)  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావ్ కరద్ (Union Minister Bhagwat Karad ) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాత్రీకేయులు హజరయ్యారు. సమావేశం ప్రారంభమైంది. ఇంతలో.. ఒక ఫోటో జర్నలిస్ట్ నిల్చున్న చోటే కుప్పకూలి పడిపోయాడు. అందరు షాక్ కు గురయ్యారు. అప్పుడు కేంద్ర మంత్రి తన సమావేశాన్ని మధ్యలో ఆపేశారు. జర్నలిస్ట్ దగ్గరకు చేరుకుని ఆయన పల్స్ రేటు చెక్ చేశారు. కిండ పడిపోయిన వ్యక్తిని.. తాజ్ మాన్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. అయితే, కేంద్ర మంత్రి స్వతహాగా సర్జన్. దీంతో ఆయన జర్నలిస్ట్ కు కొన్ని సూచనలు చేశారు. అదే విధంగా.. కేంద్ర మంత్రి అతనికి కొన్ని స్వీట్లను తినడానికి ఇచ్చారు. ఒక ఐదు నిముషాల తర్వాత.. ఆయన తిరిగి మేల్కోన్నాడు.

అతని గ్లూకోజ్ స్థాయి మాములు స్థితికి చేరుకుంది. దీంతో ఈ ఘటన కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కేంద్ర మంత్రిపై (Union Minister Bhagwat Karad ) ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనను పలువురు నాయకులు ఇన్ స్టా వేదికగా అభినందిస్తున్నారు. కేంద్ర మంత్రి తన మానవత్వాన్ని చాటు కోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ఆయన.. విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేటప్పుడు కూడా ఒక ప్రయాణికుడికి ప్రాణాపాయం నుంచి తప్పించారు. అతనికి సరైన సమయంలో ఇంజకన్ ఇచ్చారు. కాగా, భగవత్ కరాద్ 2021 లో మోదీ క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా చేరారు. ఆయన మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నుకొబడ్డారు.

First published:

Tags: Bjp, Delhi, Minister, Trending news

ఉత్తమ కథలు