Home /News /trending /

UNION MINISTER BHAGWAT KARAD SAVES LIFE OF A PASSENGER MID AIR ON INDIGO PM MODI APPRECIATES MKS

విమానంలో విపత్తు : వ్యక్తి ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రి భాగవత్ -డాక్టర్ అంటే అంతేనన్న మోదీ

విమానంలో వ్యక్తిని కాపాడిన కేంద్ర మంత్రి కరాద్

విమానంలో వ్యక్తిని కాపాడిన కేంద్ర మంత్రి కరాద్

విమానంలో అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికుడికి తక్షణ సాయం అందించిన కేంద్ర మంత్రి భాగవత్ కరాద్ పేరు కొద్ది గంటలుగా ట్రెండింగ్ లో నిలిచింది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబై ప్రయాణించిన విమానంలో జరిగిందీ ఘటన..

ఇంకా చదవండి ...
కాలం మారుతున్నకొద్దీ కొత్త ప్రొఫెషన్లు ఎన్ని పుట్టుకొచ్చినా.. ఆ వృత్తుల్లోని వాళ్లు మార్కెట్లలో రాజాజులుగా చెలామణీ అవుతున్నా.. ప్రాణాలు నిలిపే డాక్టర్లకు మాత్రం ఎవరూ సాటిరాలేరు. భగవంతుడి తర్వాత మనుషులు అధికంగా పూజించేదీ డాక్టర్లనే అనేదీ కాదనలేం. వృత్తి పరంగా ఒక్కసారి డాక్టర్ (Doctor) అయినవాళ్లు.. ప్రవృత్తులు మారినా ప్రాణాలు కాపాడే విషయం మాత్రం ఎప్పటికీ వెనుకాడబోరు. మన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాద్ లాగా. విమానం గాలిలో ఉండగా తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి..

విమానంలో అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికుడికి తక్షణ సాయం అందించిన కేంద్ర మంత్రి భాగవత్ కరాద్ పేరు కొద్ది గంటలుగా ట్రెండింగ్ లో నిలిచింది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబై ప్రయాణించిన విమానంలో జరిగిందీ ఘటన..

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..


ఢిల్లీ విమానాశ్రయం నుంచి ముంబైకి ఇండిగో విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడికి బీపీ సమస్య తలెత్తింది. విపరీతంగా చెమటలు పట్టడంతోపాటు బీపీ బాగా డౌన్ అయిపోయి.. అతను విమానంలోనే కళ్లు తిరిగి పడిపోయాడు. అది చూసి విమానం సిబ్బందితోపాటు లోపలున్నవారంతా కంగారు పడ్డారు. అయితే అదే విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి కరాద్ మాత్రం సమయానుకూలంగా స్పందించారు. వృత్తిరీత్యా డాక్టరైన కరాద్.. వెంటనే స్పందించి, కళ్లు తిరిగి పడిపోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి అతనిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. గ్లూకోజ్ ఎక్కించిన తర్వాత అతని పరిస్థితి మెరుగైంది.

Hyderabad: ఏం ఫ్యామిలీరా బాబూ! -19ఏళ్ల కూతురిని అందంగా ముస్తాబు చేసి.. వీళ్ల కథే వేరు!


విమానంలో కేంద్ర మంత్రి చర్యను ప్రశంసిస్తూ ఇండిగో విమానయాన సంస్థ ఒక పోస్టు పెట్టింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మంత్రిని మెచ్చుకుంటున్నారు. కేంద్ర మంత్రి చేసిన పనికి ప్రధాని మోదీ నుంచి కూడా అభినందన లభించింది. ఒకసారి డాక్టర్ అయితే ఎప్పటికీ డాక్టర్ గానే ఉంటారు.. అంటూ కరాద్ ను మోదీ మెచ్చుకున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: IndiGo, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు