కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ఠాకూర్Anurag Thakur విదేశీ వేదికపై స్టెప్ వేశారు. బాగా పాపులర్ అయిన మల్హరి అనే సాంగ్‌కి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్Ranveer Singhతో కలిసి డ్యాన్స్(Dance) చేశారు. ఓ హీరో మరో సెంట్రల్ మినిస్టర్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోని అనురాగ్ఠాకూర్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశారు. దుబాయ్Dubaiలో జరుగుతున్న దుబాయ్ ఎక్స్పో 2020(Dubai Expo 2020) ఇందుకు వేదికగా మారింది. ఎక్స్పో సందర్శనకు వెళ్లిన కేంద్రమంత్రిని ఈవెంట్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు హీరో రణవీర్‌సింగ్ డ్యాన్స్ చేయమని కోరాడు. అక్కడే ఈ ఇద్దరు సెలబ్రిటీలు డ్యాన్స్ మూమెంట్ షేర్ చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియా పెవిలియన్‌లో ది గ్లోబల్ రీచ్ ఆఫ్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ(The Global Reach of Indian Media and Entertainment Industry)పై జరిగిన చర్చలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్‌తో ముచ్చటించారు కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్. ఆ ఈవెంట్లో భాగంగానే ఈ డ్యాన్స్ స్టెప్పులు వేదికపై కనిపించాయి.
హీరోతో కలిసి కేంద్రమంత్రి డ్యాన్స్..
ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రణ్‌వీర్‌సింగ్ తన హిట్ సాంగ్ మల్హరికి ఒక్క స్టెప్పు వేయమని కేంద్రమంత్రిని కోరారు. ఆయన చేయి పట్టుకొని పలుమార్లు కోరడంతో అనురాగ్ఠాకూర్ స్టేజ్‌పై స్టెప్పులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో మాట కాదనలేకపోయిన కేంద్రమంత్రి అతనితో కాలు కదపాల్సి వచ్చింది. స్టెప్స్ వేయగానే రణ్‌వీర్‌సింగ్ ఆనందంతో కేంద్రమంత్రో చేతులు కలిపాడు.
The power of Bollywood transcends barriers!
Union Minister @ianuragthakur with @RanveerOfficial at @IndiaExpo2020 #DubaiExpo2020. pic.twitter.com/YMRF6FKR9u — Office of Mr. Anurag Thakur (@Anurag_Office) March 28, 2022
వాహ్ క్యా సీన్ హై..
దుబాయ్‌లో జరిగిన ఈకార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రవాసభారతీయులు అటెండ్ అయ్యారు. దుబాయ్‌లోని భారతీయులు భారతదేశానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని చెప్పుకొచ్చారు అనురాగ్ఠాకూర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇంత భారీగా వేడుకలు జరుగుతుండటమే అందుకు నిదర్శనమన్నారు. ఇండియా ఏ విషయంలోనైనా ప్రపంచంలోనే ఓ ఉపఖండంగా మార్చడమే తన లక్ష్యమన్నారు అనురాగ్ఠాకూర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dubai, Ranveer Singh, Union minister