కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి దైవ భక్తి ఎక్కువే. ఆయన తరచూ ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. ఐతే... ఈ సందర్శనాల్లో ఎక్కువ భాగం ఒంటరిగా వెళ్లేవే ఉంటాయి. కానీ తాజాగా ఆయన... గుజరాత్.. గిర్‌లోని ప్రముఖ సోమనాథ్ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
అమిత్ షా పర్యటన దృష్ట్యా ఆలయ భద్రతను మరింత పెంచారు. అమిత్ షా ఫ్యామిలీకి స్వాగతం పలికిన ఆలయ పూజారులు.. సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. తమ మధ్యలో మనవరాలిని కూర్చోబెట్టుకొని.. అమిత్ షా దంపతులు పూజలో పాల్గొన్నారు. శివలింగానికి అభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
#WATCH | Union Home Minister Amit Shah along with his family members offers prayers at Somnath Temple in Gir, Gujarat. pic.twitter.com/B68fPBnNqW
— ANI (@ANI) March 19, 2023
సోమనాథ ఆలయం చాలా బాగుంటుంది. ఇండియాలోని అత్యద్భుత ఆలయాల్లో ఇదొకటి. అందుకే అమిత్ షా దంపతులు కూడా ఆలయం ముందు నిలబడి ఫొటో తీయించుకున్నారు.
ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. 2 వేల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. "జై సోమనాథ్... హర హర మహదేవ్" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "చాలా బాగుంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.