హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Variety News: ఆర్టీసీ బస్సు చోరీ .. దొంగిలించిన వ్యక్తుల కోసం పోలీసుల గాలింపు

Variety News: ఆర్టీసీ బస్సు చోరీ .. దొంగిలించిన వ్యక్తుల కోసం పోలీసుల గాలింపు

KSRTC BUS STEAL(Photo:Twitter)

KSRTC BUS STEAL(Photo:Twitter)

Viral News: దొంగలు, నగలు, వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం. ఇళ్లు, బ్యాంకులను లూఠీ చేయడం విన్నాం. కాని కర్నాటకలో ఖతర్నాక్ దొంగలు ఏకంగా రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సునే మాయం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bidar, India

దొంగలు, నగలు, వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం. ఇళ్లు, బ్యాంకులను లూఠీ చేయడం విన్నాం. కాని కర్నాటకలో ఓ ఖతర్నాక్ దొంగలు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కర్నాటక(Karnataka) రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బీదర్ నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు(KS RTC BUS) సోమవారం రాత్రి చించోళి (Chincholi)బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడే నైట్ హాల్ట్ చేయాల్సి ఉండగా బస్‌ను నిలిపివేసిన (డ్రైవర్Driver), కండక్టర్ (Conductor), విశ్రాంతిస్ట్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో బస్సు మాయమైపోయింది. తెల్లవారు జామునే వచ్చి చూసిన డ్రైవర్, కండక్టర్‌కు బస్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు.

ఆర్టీసీ బస్ చోరీ ..

ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే నైట్ బస్టాండ్‌లో నిలిపివేసిన బస్సును ఇద్దరు దొంగలు మంగళవారం తెల్లవారు జామున డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విచిత్రం ఏమిటంటే సీసీ ఫుటేజ్ ఆదారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలతో బస్సును కనుగొనేందుకు ఏర్పాటు చేశారు.

పక్క స్టేట్ బోర్డర్‌లో బస్సు ..

దొంగిలించబడిన ఆర్టీసీ బస్సు కోసం కర్నాటక పోలీసు బృందాలు రెండు రంగంలోకి దిగాయి. సుమారు 10గంటల పాటు బస్సు ఆచూకీ కోసం గాలించగా అడ్రస్ దొరికింది. తెలంగాణ సమీపంలోని భూకైలాస్‌ తండాలో బస్సును వదిలివెళ్లారు దొంగలు. అక్కడ బస్‌ను గుర్తించిన పోలీసులు దాన్ని కర్నాటకు తరలించారు. దొంగల కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్సును దొంగిలించాలని చూసిన వాళ్లను ఎలాగైనా పట్టుకొని తీరుతామని కర్నాటక పోలీసుల స్పష్టం చేశారు.

OMG: RTCబసులో ప్రయాణికురాలి సీటుపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి ..తర్వాత ఏమైందంటే

దొంగల కోసం గాలింపు ..

అయితే ఆర్టీసీ బస్సు దొంగిలించబడిన విషయాన్ని అక్కడి ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచాలని చూసినప్పటికి అందరికి తెలిసిపోయింది. మరోవైపు బస్సును గుర్తించిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రజలు ఈఘటన జరిగిన తీరు చూసి నవ్వుకుంటున్నారు.

First published:

Tags: Crime news, Karnataka, RTC buses

ఉత్తమ కథలు