Viral Video: తల్లి కడుపులోనే తన్నుకుంటున్న కవలలు.. స్కానింగ్‌లో వెల్లడి

తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇలా కొట్టుకుంటే, ఇక పుట్టిన తర్వాత ఇంకెంత కొట్టుకుంటారో అని కొందరు కామెంట్ చేస్తే, వాళ్లు ఒకరిని ఒకరు చాలా బాగా చూసుకుంటారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: April 17, 2019, 12:36 PM IST
Viral Video: తల్లి కడుపులోనే తన్నుకుంటున్న కవలలు.. స్కానింగ్‌లో వెల్లడి
గర్భవతి (నమూనా చిత్రం)
news18-telugu
Updated: April 17, 2019, 12:36 PM IST
పిల్లలు అంటే కొట్టుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు. అక్కచెల్లెళ్లు. అన్నాచెల్లెళ్లు. ఇలా ఎవరైనా అంతే. కవలలు కూడా అందులో ఏమీ తీసిపోరు. అయితే, అది పుట్టిన తర్వాత. మరి పుట్టకముందే, తల్లి కడుపులో ఉన్నప్పుడే తన్నుకుంటుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలో చూపినట్టుగా ఉంటుంది. ఔను. తల్లి కడుపులో ఉన్న కవలలు ఒకరిని ఒకరు కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఏడాది క్రితం తీసిందట. చైనాలోని యిన్ చౌన్‌ ప్రాంతంలో ఓ మహిళ నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను భర్త స్కానింగ్ కోసం తీసుకుని వెళ్లాడు. ఆ సమయంలో వైద్యులు స్కానింగ్ చేస్తుండగా, అందులో ట్విన్స్ కనిపించారు. విచిత్రంగా ఆ ఇద్దరూ తన్నుకుంటున్నారు. దీన్ని చూసి థ్రిల్ ఫీల్ అయిన తండ్రి ఆ స్కానింగ్ మొత్తాన్ని తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే అది ఇప్పుడు బీభత్సంగా వైరల్ అవుతోంది. ఏకంగా 20లక్షల మంది దాన్ని షేర్ చేశారు. 25 లక్షల మందికి పైగా దాన్ని వీక్షించారు.

China, Facebook Viral video, Twin Sisters, twins, ultrasound, Ultrasound video, Yinchuanm, తల్లి కడుపులోనే తన్నుకున్న ట్విన్స్, చైనాలో వైరల్ వీడియో
తల్లి కడుపులోనే తన్నుకుంటున్న ట్విన్స్


ఇది ఏడాది క్రితం వీడియో. ఇప్పుడు వారిద్దరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఇద్దరూ ఆడపిల్లలే. కాదు ఆడపులులు అనాలేమో. వారికి ఆ తల్లిదండ్రులు చెర్రీ, స్ట్రాబెర్రీ పేర్లు పెట్టారంట. ఈ వీడియోను చూసిన వారు ఆ ట్విన్స్‌ ఫైటింగ్ వీడియోను చూసి తెగ మెచ్చుకుంటున్నారు. వారు తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇలా కొట్టుకుంటే, ఇక పుట్టిన తర్వాత ఇంకెంత కొట్టుకుంటారో అని కొందరు కామెంట్ చేస్తే, వాళ్లు ఒకరిని ఒకరు చాలా బాగా చూసుకుంటారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి



First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...