• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • UNBELIEVABLE YOUNG MAN CONTROLS RATS AND DANCES THEM WITH HIS FINGER NETIZENS SURPRISE AFTER WATCHING VIRAL VIDEO NK

Video: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఎలుకల్ని శాసిస్తున్నాడుగా!

ఎలుకల్ని శాసిస్తున్నాడుగా! (image credit - instagram)

Viral Video: అతని టాలెంట్ అద్భుతం. చూస్తే మన కళ్లతో మనం నమ్మలేం. వేలి సైగలతో ఆదేశాలు ఇస్తే చాలు ఆ ఎలుకలు చెప్పినట్లు చేస్తున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? అతని దగ్గర మ్యాజిక్ ఉందా?

  • Share this:
    Viral Video: సినిమాల్లో జంతువులు, ఎలుకల వంటివి మనం చెప్పినట్లే వింటాయి. ఎందుకంటే... వాటిలో చాలా వరకూ గ్రాఫిక్సే ఉంటాయి. కానీ రియల్ లైఫ్‌లో ఓ వ్యక్తి... ఎలుకల్ని తన వేళ్ల సైగలతో ఆడిస్తున్నాడు. అవి కూడా అతను చెప్పినట్లే వింటున్నాయి. ఆ వీడియో చూస్తే... అతని వేళ్లకు ఏదైనా మ్యాజికల్ పవర్ ఉందా అనిపించకమానదు. చూడ్డానికి ఈ వీడియో కొంత ఫన్నీగా ఉన్నా... నిజానికి అతని జీవితం వైపు నుంచి చూస్తే... అదో బాధాకరమైన అంశమే. ఎలుకల్ని ఆడిస్తూ... రోడ్డు పక్కన డబ్బు సంపాదించుకుంటున్నాడు అతను. చాలా మందిలా బిచ్చం ఎత్తుకోకుండా... ఈ టాలెంట్ చూపిస్తూ... వస్తూ పోయే వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

    ఈ వీడియోలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న అంశం ఒకటే. ఎలా ఎలుకలు అతని మాట వింటున్నాయి అన్నది. నాలుగు ఎలుకల్ని తన ముందు పెట్టుకున్న ఆ యువకుడు... వాటిలో ఒక్కోసారి ఒక్కో దాన్ని అటూ ఇటూ వదులుతున్నాడు. వదిలాక... తన వేలు చూపిస్తూ... సైగ చేస్తున్నాడు. ఆ వేలి సైగను చూస్తూ... ఎలుకలు తిరిగి తమ ప్రదేశానికి వచ్చేస్తున్నాయి. ఇలా ఎటు విసిరినా అవి తిరిగి వచ్చేస్తుండటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.








    View this post on Instagram






    A post shared by CRAZY JATTS (@crazy_jatts)





    ఈ వీడియోని క్రేజీ జాట్స్... ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. చాలా మందికి ఇచి బాగా నచ్చింది. చాలా మంది దీన్ని నమ్మలేకపోతున్నారు. అతని స్కిల్‌ని అంతా మెచ్చుకుంటున్నారు. కొంత మంది మాత్రం ఇలా మూగ జీవాల్ని ఆడించడం అంటే... వాటిని బంధించడంతో సమానం అంటున్నారు.

    ఇది కూడా చదవండి: Earn Money Online: ఈ 50పైసలు మీ దగ్గరుంటే రూ.లక్ష మీవే

    నిజానికి ఇదో ట్రైనింగ్. ఎలుకలకు ఆహారం ఇచ్చే ముందు ఇలా చేయిస్తారు. ఆహారం కోసం అవి చెప్పినట్లు వింటాయి. సర్కస్‌లో జంతువులకు కూడా ఇలాగే ట్రైనింగ్ ఇస్తారు. రోజుల తరబడి ట్రైనింగ్ తీసుకొని దానికి అలవాటవుతాయి. సర్కస్‌లో పులులు, సింహాలను ఆడించేవారు... సన్నటి పుల్లను చేతిలో పట్టుకుంటారు. అది లేకపోతే.. ఆ జంతువులు కచ్చితంగా దాడి చేస్తాయి. ఆ పుల్లే వాటి నుంచి అతన్ని కాపాడుతుంది. ఆ పుల్లను చూపిస్తూ అతను చేసే సైగలను ఆ జంతువులు పాటిస్తాయి. ఆ పుల్లలోనే అంతా ఉంటుంది. ఇక్కడ కూడా ఆ వేలిలోనే అంత ఉంటుంది. వేలు చూపించకపోతే... ఆ ఎలుకలు... అటు నుంచి అటే వెళ్లిపోతాయి.
    Published by:Krishna Kumar N
    First published: