Home /News /trending /

UMA BHARTI THROWS STONE AT LIQUOR SHOP IN BHOPAL TO WARN ADMINISTRATION PVN

Viral Video : మద్యం షాపుపై రాయి విసిరన మాజీ సీఎం..సొంత ప్రభుత్వానికి హెచ్చరిక

ఉమా భారతి (ఫైల్ ఫొటో)

ఉమా భారతి (ఫైల్ ఫొటో)

UMA Bharti : 2022 జనవరి 15 కల్లా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేపడతామని ఆమె గతేడాది ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోగా కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. మద్యాన్ని మరింత తక్కువ ధరకే విక్రయించనున్నట్లు పేర్కొంది.

ఇంకా చదవండి ...
Uma Bharti Attack On Liquor Shop : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ నాయకురాలు ఉమా భారతికి పట్టరాని కోపం వచ్చింది. భోపాల్‌ లోని బర్ఖేరా పఠానీ ప్రాంతంలోని ఓ మద్యం షాపుపై తన అనుచరులతో కలిసి దాడికి దిగారు ఉమా భారతి. మద్యం సీసాలపై రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారు. మద్యం షాపులోకి వెళ్లి రాయితో సీసాలను పగలగొట్టిన వీడియోను ఉమాభారతి ట్విట్టర్‌ లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఉమాభారతి అల్టిమేటం జారీ చేశారు.

కాగా, 2022 జనవరి 15 కల్లా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేపడతామని ఆమె గతేడాది ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోగా కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. మద్యాన్ని మరింత తక్కువ ధరకే విక్రయించనున్నట్లు పేర్కొంది. ఉమా భారతి విధించిన డెడ్‌లైన్‌ దాటిన 2 రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశీ మద్యం అమ్మకాలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో పాటు విదేశీ లిక్కర్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 10-13 శాతం తగ్గించింది. ప్రజలు గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చని ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఇంట్లోనే బార్‌ను తెరుచుకునేందుకు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. దీనిపై మండిపడ్డ ఉమాభారతి..మధ్యం షాపుపై రాళ్లతో దాడికి దిగింది. అయితే, ఈ ఘటనపై ఎవరూ తమకు ఫిర్యాదు ఇవ్వలేదని, ఉమా భారతిపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని భోపాల్ పోలీస్ కమిషనర్ మకరంద్ డియోస్కర్ వెల్లడించారు.


హిందీలో చేసిన ట్వీట్లలో ఉమాభారతి...ఇది కూలీల ప్రాంతం. మద్యం దుకాణం ఉన్న ప్రాంతానికి సమీపంలోనే ఓ దేవాలయం, పాఠశాల ఉన్నాయి. సాయంత్రం పూట మహిళలు తమ డాబాలపైకి వస్తే, మద్యం మత్తులో ఉన్న మగవాళ్లు వారిని ఇబ్బంది పెడుతున్నారు. కూలీలు తమ సంపాదనలో ఎక్కువగా మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ షాపును తొలగించాలంటూ ఈ ప్రాంత మహిళలు ఇప్పటికే నిరసనలు చేపట్టారు. కానీ జిల్లా యంత్రాంగం అలా చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bhopal, Madhya pradesh, Uma Bharti

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు