హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ‘సారీ.. నవ్వు ఆపుకోలేకపోతున్నాం’: మంచులో నడిచేందుకు మహిళ అష్టకష్టాలు: చూసేయండి

Viral Video: ‘సారీ.. నవ్వు ఆపుకోలేకపోతున్నాం’: మంచులో నడిచేందుకు మహిళ అష్టకష్టాలు: చూసేయండి

Twitter Photo

Twitter Photo

Viral Video: మంచులో నడవలేక జారి పడిపోతే, ఇబ్బందులు పడిన మహిళ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్​గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. “క్షమించండి.. కానీ నవ్వు ఆపులేకపోతున్నాం” అని కామెంట్లు చేస్తున్నారు.

ఉక్రెయిన్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. వీధులన్నీ పూర్తి తడిగా మారిపోతున్నాయి. రహదాలపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు కురిసిన ఓ రోడ్డుపై ఓ మహిళ అసలు నడవలేకపోయింది. కనీసం నిలబడలేక జారి.. జారి కింద పడిపోయింది. ఉక్రెయిన్ ప్రజల ఇబ్బందులను తెలియజేసేందుకు సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

నిమిషం 2 సెకన్ల పాటు ఉన్న వీడియో క్లిప్​లో, ఆ మహిళ జారడం, పడిపోవడమే ఉంది. నిలబడేందుకు, నడిచేందుకు ప్రయత్నించిన ప్రతీసారి ఆమె కిందపడియారు. నిస్సహాయంగా మోకాళ్లపై నడవాలనుకున్న ఆమెకు సాధ్యపడలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోకు విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. చాలా మంది ఈమె పరిస్థితి 2020 లాగే ఉందంటూ కామెంట్లు చేశారు.

“ఉక్రెయిన్ ప్రజల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. అయితే ఎవరూ నొచ్చుకోవద్దు. ఈ వీడియో చూసేటప్పుడు నేను నవ్వుఆపుకోలేకపోయా. ఈ వీకెండ్ అంతా పాప్​ కార్న్ చూస్తూ ఈ వీడియో చూడాలనుకుంటున్నా” అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.

“నేను ఇది చూసి చాలా నవ్వా. క్షమాపణలు. ఆమె బాగానే ఉన్నారని ఆశిస్తున్నా” మరో నెటిజన్ స్పందించాడు.

First published:

ఉత్తమ కథలు