హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Ukraine war: ఉక్రెయిన్ బలగాలకు రష్యా అల్టిమేటం.. లొంగి పోండి.. లేక పోతే దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుంది..

Ukraine war: ఉక్రెయిన్ బలగాలకు రష్యా అల్టిమేటం.. లొంగి పోండి.. లేక పోతే దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుంది..

పుతిన్ (ఫైల్)

పుతిన్ (ఫైల్)

Russia Ukraine Crisis: పుతిన్ సైనికులు ఏడువారాలకు పైగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే అక్కడి నగరాలు శిథిలాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసిన శవాల గుట్టలు కనిపిస్తున్నాయి.

Russia Calls On Ukrainian Forces To Immediately Lay Down Arms: రష్యా ఉక్రెయిన్ పై ముప్పెట దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే బాంబులు,క్షిపణులు, విమానాల దాడులతో ఉక్రెయిన్ తన రూపు రేఖలను కోల్పోయింది. ఇప్పటికే ఉక్రెయిన్ ను వదిలి లక్షల మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. కొంత మంది ప్రజలు తమ ఇళ్లలో ప్రాణాలును అరచేతిలో పెట్టుకుని భయంభయంగా బతుకుతున్నారు. ఇక రష్యా, ప్రధాన నగరాలు, ఆస్పత్రులు, సామాన్య ప్రజల నివాస సముదాయాలను టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడుతుంది.

ఇప్పటికే కీవ్, మేరియుపోల్, లివివ్,ఖర్కీవ్ లపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రధాన నగరాలలో ఒకటైన మేరియుపోల్ ను రష్యా ఆక్రమించుకుంది. అక్కడి ప్రధాన ప్రాంతాలలోని భవనాలను రష్యా బాంబులతో నెలమట్టం చేసింది. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఉక్రెయిన్ సైనికులు, రష్యాను నిలువరిస్తున్నారు. వారు దాడులకు గట్టిగా తిప్పికొడుతున్నారు.

ఈ క్రమంలో రష్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికైన మేరియుపోల్ లో ఉన్న మిగతా సైనికులు లొంగిపోవాలని ఆదేశించింది. అదే విధంగా, వారిని జెనివా ఒప్పందం ప్రకారం, పునారావాసం కల్పిస్తామని తెలిపింది. దీనిపై ఉక్రెయిన్ ఘాటుగా స్పందించింది. లొంగిపోయే ప్రసక్తేలేదని తెల్చిచెప్పింది.  మేరియు పోల్ ను రకించుకునేందుకు తాము.. చివరి వరకు పోరాడతామని ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్ స్కీ తెలిపారు. మేరియుపోల్ లో ఉన్న సైనికులపై రష్యా మారణ కాండను కొనసాగిస్తుందని జెలెన్ స్కీ తెలిపారు. రష్యను ఎదుర్కొవడానికి తమకు మరిన్ని ఆయుధ సహాకారం కావాలని జెలెన్ స్కీ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు.

రష్యాన్ దళాలు బుచా నగరంలో సృష్టించిన మారణ హోమం ప్రపంచాన్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడ వేల కొలది మృత దేహాలు కుప్పలుగా వెలుగు చూశాయి. అమాయకులను, మహిళలను, నిరాయుధులను, చిన్న పిల్లలను అందరిపై రష్యాన్ సైన్యాలు దాడులకు తెగబడుతున్నాయి.  బుచా నగరంలో... వందల మంది వారి కణుతులపై కాల్చి చంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  ప్రపంచ దేశాలు పుతిన్ యుద్దోన్మాదాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.

బాంబులు, క్షిపణులు, విమానాలతో దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కీవ్, మరియూ పోల్ పలు నగరాలు ధ్వంస మయ్యాయి. ఇక లక్షల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేరే ప్రాంతాలకు వలస పోతున్నారు. పౌరుల నివాస భవనాలు, ఆస్పత్రులు, సైనిక ప్రదేశాలు, ప్రతి దానిపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఒకవైపు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు రష్యాన్ సైన్యాలు దారుణమైన దాడులకు తెగబడుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు మేరకు ప్రజలు స్వచ్చందంగా మెషిన్ గన్ లు పట్టుకుని తమ మాతృభూమి కోసం యుద్దంలో దిగుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు