HOME »NEWS »TRENDING »uk woman lies on railway crossing to pose for photos warning issued video goes viral krs

Viral Video: రైల్వే క్రాసింగ్​ వద్ద పడుకున్న మహిళ.. తీవ్రంగా హెచ్చరికలు

Viral Video: రైల్వే క్రాసింగ్​ వద్ద పడుకున్న మహిళ.. తీవ్రంగా హెచ్చరికలు
Twitter image

ఫొటో షూట్ (Photo Shoot) కోసం ఏకంగా ఓ మహిళ రైల్వే క్రాసింగ్​ వద్ద ట్రాక్​పై పడుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Share this:
    రైల్వే క్రాసింగ్​ల వద్ద ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. క్రాసింగ్​ల వద్ద ప్రమాదాలతో పదుల మంది మృతి చెందిన విషాదకర ఘటనలూ జరిగాయి. అయితే కొందరు మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఇలాంటి చర్యకు పాల్పడగా.. రైల్వే శాఖ తీవ్రంగా హెచ్చరించింది.

    బ్రిటన్​లో ఈ ఘటన జరిగింది. ఓ లెవెల్ క్రాసింగ్ వద్ద ఓ మహిళ ఫొటో షూట్ కోసం వచ్చింది. ఏకంగా ఫొటో దిగేందుకు ట్రాక్​పైనే పడుకుంది. రైళ్లు వస్తాయని ఏ మాత్రం భయం లేకుండా నింపాదిగా ట్రాక్​పై ఫొటోలకు ఫోజులిచ్చింది. కెమెరా పట్టుకున్న వ్యక్తి సైతం ఏ మాత్రం భయం లేకుండా పని కానిచ్చేశారు. దీన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన బ్రిటన్ రైల్వే నెట్​వర్క్ హెచ్చరికలు జారీ చేసింది.



    “నో.. నో.. లెవెల్ క్రాసింగ్​ల వద్ద ఫొటో షూట్​లు చేసుకోకూడదు. ఒకవేళ ఎక్సర్​సైజ్​లు చేస్తుంటే, క్రాసింగ్​ల వద్ద మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. భద్రంగా, సురక్షితంగా ఉండాలని పిల్లలకు చెప్పాలి. మంచి ఉదాహరణగా ఉండాలి. క్రాసింగ్​ల వద్ద ఎప్పుడూ ఆగి.. అన్ని వైపులా చూసి.. శబ్దాలను విని ముందుకు సాగాలి” అని నెట్​వర్క్ రైల్ వీడియోతో సహా ట్వీట్ చేసింది.

    కాగా రైల్వే క్రాసింగ్​ వద్ద ఫొటోలు దిగిన ఆ మహిళ వీడియో కాసేపట్లోనే వైరల్​గా మారింది. దీంతో ఆమె నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్య వైఖరా అంటూ ప్రశ్నించారు.



    క్రాసింగ్​ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను అందరూ గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
    Published by:Krishna P
    First published:January 24, 2021, 12:28 IST