Home /News /trending /

UK WOMAN DESTROYS 500 LIQUOR BOTTLES IN SUPERMARKET SMASHES THEM ON THE GROUND SU GH

Viral Video: 'అయ్యో..అయ్యో.. మందంతా వేస్ట్ అయిందే'.. 500 మద్యం బాటిల్స్ ను నేలకేసి కొట్టిన మహిళ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్రేజీగా ప్రవర్తించడమనేది చాలా మంది గుర్తింపుగా భావిస్తారు. అందుకోసం విభిన్నరకాల వేషాలు వేస్తారు.

క్రేజీగా ప్రవర్తించడమనేది చాలా మంది గుర్తింపుగా భావిస్తారు. అందుకోసం విభిన్నరకాల వేషాలు వేస్తారు. అయితే ఆ వెర్రి ఎక్కువతైనే.. ప్రమాదం. అందులోనూ ఆల్క్ హాల్ కోసం అయితే పిచ్చి పిక్స్ కూ వెళ్తారు చాలామంది. అంతలా మనుషులను విచిత్రంగా మారుస్తుంది మద్యం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మద్యాన్ని వృథా చేయాలంటే మందుబాబుల మనసు అస్సలు ఒప్పుకోదు. అలాంటిది ఏకంగా తన క్రేజీ ప్రవర్తనతో 500 బాటిల్స్ ను నేలకేసి కొట్టి విస్మాయానికి గురి చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఇంగ్లాండ్ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవలే ఇంగ్లాండ్ లోని స్టీవేనేజ్ లో అల్దీ సూపర్ మార్కెట్ కు ఓ అపరిచత మహిళ వచ్చింది. కాసేపు షాపింగ్ చేద్దామి స్టోర్లో వివిధ ప్రదేశాలను కలయ తిరిగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గాని లిక్కర్ బాటిల్ ను ఒక్కొక్కటిగా తీసు నెలకేసి బాదడం మొదలుపెట్టింది. ఈ విధంగా దాదాపు 500 బాటిల్స్ ను నేల కేసి కొట్టింది. ఈ ఘటనలో ఆమె చేతికి గాయమైంది ఆమె ప్రవర్తను అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఈ తతంగాన్నంతా స్థానికులు వీడియోగా తీశారు. ఆ వీడియోను స్థానిక పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

గ్రే కలర్ హూడీ, బ్యాగీ ఆరెండ్ ప్యాంట్స్ ను ధరించిన ఆ మహిళ ఎవరనేది తెలియలేదు. ఈ సంఘటన వెంటనే పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని విచారణ చెపట్టారు. ఆమెకు సంబంధించిన వివరాలను పోలీసులు బయటకు వ్యక్త పరచలేదు. గాయమైన ఆమె చేతికి చికిత్స చేయించారు.

అయితే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ను చూసినవారంతా ఆమె ప్రవర్తన చూసి విశేషంగా స్పందిస్తున్నారు. ఇంత వరకు ఇలాంటిది చూడలేదని ఒకరు పోస్ట్ చేయగా.. బహుశా ఆమెకో ఆరోగ్యం బాగాలేదేమోనని మరొకరు ట్వీట్ చేశారు. ఆమెకు పిచ్చిపట్టిందని ఇంకొకరు స్పందించారు. అయ్యో.. మందంతా వేస్ట్ అయిపోయిందని క్రేజీగా స్పందించాడు మరో ఔత్సాహికుడు.





ఇలా బాటిల్స్ ను పగలగొట్టే విషయానికొస్తే గత ఆగస్టులో థేకాలోని సిటీ మాల్లో రోహిణి అనే అమ్మాయి ఓ వ్యక్తి ముఖంపై బాటిల్ ను కొట్టింది. తనతో వాదనకు దిగాడన్న కారణంగా ఈ పనిచేసింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Liquor, Uk

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు