హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

డ్రంక్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన మహిళ.. వొడ్కాను కన్నులతో తాగానని పోలీసులతో వాగ్వాదం..

డ్రంక్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన మహిళ.. వొడ్కాను కన్నులతో తాగానని పోలీసులతో వాగ్వాదం..

చెల్సియా మెక్ డొనాల్డ్ (ఫైల్)

చెల్సియా మెక్ డొనాల్డ్ (ఫైల్)

United kingdom: పోలీసులు డ్రంక్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఇంతలో ఒక మహిళ రోడ్డుపై బ్యాలెన్స్ తప్పి వింతగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

తాగి వెహికిల్స్ ను నడపోద్దని పోలీసులు ఎంతచెప్పిన కొంత మంది అసలు పట్టించుకోరు. పైగా పీకల దాక తాగి రోడ్డుమీద న్యూసెన్స్ చేస్తుంటారు. కొందరు వచ్చి పోయే వారితో గొడవలు పెట్టుకుంటారు. ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తు ఇతరులకు ఇబ్బందుతు పెడుతుంటారు. మరికొందరు.. తాగిన కూడా.. తాగలేమని, పోలీసులతోనే గొడవలకు దిగుతుంటారు. ఇంకొందరు.. పోలీసులు చెక్ చేస్తున్నారంటే.. పారిపోతుంటారు. ఈకోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఇంగ్లాండ్ లో (England) ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ డ్రంక్ డ్రైవ్‌లో పోలీసులకుక దొరికింది. కానీ, ఆమె ఏకంగా పోలీసులతోనే మొండి వాదం పెట్టుకుంది. ఒక వైపు తాను వొడ్కా తాగాను అని చెబుతూనే.. ఆ వొడ్కాను నోటితో కాకుండా కంటితో తాగానని చెప్పింది. అది కూడా తూలుతూ చెప్పింది. దీంతో పోలీసులు షాక్ నకు గురయ్యారు.

ఇంగ్లాండ్‌కు చెందిన చెల్సియా మెక్ డొనాల్డ్ (30) అనే మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌కు బయల్దేరి వెళ్లింది. ఆమె బార్ పార్కింగ్ ఏరియాలో తన బీఎండబ్ల్యూ కారును నిలిపి బయటకు అడుగు పెట్టింది. అంతలోనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆల్కహాల్ టెస్టు చేశారు.

సాధారణ స్థాయిల కంటే రెండు రెట్లు అధికంగా చూపెట్టింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌లో గతేడాది నవంబర్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కానీ, చెల్సియా మెక్ డొనాల్డ్ మాత్రం తాను తప్పు చేయలేదని వాదించుకొచ్చింది. తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనే కారును డ్రైవ్ చేశానని చెప్పింది. అయితే, కారును ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత తన మిత్రులు కలిసి అందుబాటులో ఉన్న వొడ్కాను స్వల్ప సమయంలోనే పూర్తి చేయాలని అనుకున్నారు. ఇందుకు కంటిలో పోసుకోవడం ద్వారా వొడ్కాను చాలా వేగంగా పూర్తి చేయవచ్చని భావించారని వివరించింది. అలాగే, ఆ బాటిల్‌ వొడ్కాను తాగి బయటకు వచ్చామని చెప్పింది. ప్రస్తుతం ఈ ఘతన నెట్టింట వైరల్ గా (viral news)  మారింది.

First published:

Tags: Crime news, Drunk and drive, England, VIRAL NEWS

ఉత్తమ కథలు