కొంత మంది పిల్లలు చిన్నతనంలోనే వింతగా ప్రవర్తిస్తున్నారు. నెట్ లో అడ్డమైన వీడియోలు చూసి ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియకుండా చాటు మాటుగా, అశ్లీల వీడియోలు చూస్తున్నారు. వాటి ప్రభావానికి లోనై.. అదే విధంగా చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. యూకే కు (United kingdom) చెందిన 15 ఏళ్ల బాలుడు చేసిన పరి అతని ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. అతగాడు.. తన జననాంగాల్లో యుఎస్‌బి కేబుల్ ను చొప్పించాడు. లోపలు పురుషాంగం కొలవడానికి ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత.. అది లోపల ముడుతలు పడి ఇరుక్కుపోవడంతో మూత్రంలో రక్తం బయటకు వచ్చింది. వెంటనే ఇంట్లో వారుఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతనికి స్కానింగ్ చేసి.. పురుషాంగంలో చిక్కుకున్న కేబుల్ ను గుర్తించారు. వెంటనే అతడికి ఆపరేషన్ చేసి కేబుల్ ను తొలగించారు.
ఆతర్వాత.. బాలుడు తాను చేసిన పనిని డాక్టర్లకు చెప్పాడు. తన తల్లి గది నుండి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే తాను రూలర్‌ను ఉపయోగించకుండా ఉద్దేశపూర్వకంగా కేబుల్‌ను చొప్పించానని అతను వైద్యుల ముందు అంగీకరించాడు.
వైద్యులు సైన్స్ డైరెక్ట్ నివేదికలో ఇలా వ్రాశారు, "USB వైర్ యొక్క రెండు దూరపు పోర్ట్‌లు బాహ్య మూత్ర విసర్జన నుండి పొడుచుకు వచ్చినట్లు కనుగొనబడ్డాయి. వైద్యులు కేబుల్‌ను మెటల్ రాడ్‌తో తొలగించలేకపోయారు మరియు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా.. మూత్రనాళంలో.. చిక్కుకున్న కేబుల్‌ను యాక్సెస్ చేయడానికి అతని జననాంగాలు, మలద్వారం మధ్య కాథెటర్‌లు చొప్పించడం జరిగిందని వైద్యులు చెప్పారు.
ఆ తర్వాత.. ఆపరేషన్ చేసి వైర్ యొక్క రెండు చివరలను బాహ్య యురేత్రల్ మీటస్ ద్వారా విజయవంతంగా బయటకు తీశారు అని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాలుడు బాగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. పదిహేను రోజుల తర్వాత కాథెటర్‌లు తొలగించబడ్డాయి. అతను కొంత కాలం పాటు రెగ్యులర్ గా వైద్యుల అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు తెలిపారు. దీనిలో అతనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్ కన్పిస్తాయన్నారు. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం కనిపించడం, బాధాకరమైన అంగస్తంభనలు, మూత్రం నిలుపుదల వంటివి కలుగుతాయని కేస్ స్టడీ డాక్టర్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: United Kingdom, VIRAL NEWS