100 Years Old Love Letter: వెలుగులోకి వంద సంవత్సరాల క్రితం నాటి ప్రేమ లేఖ.. అందులో ఏం రాసి ఉందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ లేఖ అనగానే అందులో ఏం రాశారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇక వంద సంవత్సరాల కిందటి ప్రేమ లేఖ వెలుగు చూసిందంటే ఇంకేముంది? అందులో దేని గురించి రాశారో తెలసుకోవాలని ప్రతి ఒక్కరికీ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. తాజాగా బ్రిటన్‌లో ఓ మహిళ, ఆమె కుమారుడు వంద సంవత్సరాల కిందటి ప్రేమ లేఖను గుర్తించారు.

  • Share this:
ప్రేమ లేఖ (Love Letter) అనగానే అందులో ఏం రాశారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇక వంద సంవత్సరాల కిందటి ప్రేమ లేఖ వెలుగు చూసిందంటే ఇంకేముంది? అందులో దేని గురించి రాశారో తెలసుకోవాలని ప్రతి ఒక్కరికీ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. తాజాగా బ్రిటన్‌లో ఓ మహిళ, ఆమె కుమారుడు వంద సంవత్సరాల కిందటి ప్రేమ లేఖను గుర్తించారు. పగిలిపోయిన టైల్‌లో లవ్ లెటర్ వారికి దొరికింది. ప్రేమ లేఖను పరిశీలిస్తే.. ఓ వివాహిత మహిళకు ఆమె ప్రియుడు రొనాల్డ్ హబ్ గుడ్ రాసినట్టుగా తెలుస్తోంది.

ప్రేమలేఖ ఎలా బయట పడింది?
ఇటీవల డాన్ కార్న్స్ అనే మహిళ ఇంట్లో 55 అంగుళాల టీవీ కింద పడి టైల్ పగిలిపోయింది. అందులో ఉన్న ఓ ప్రేమలేఖను తన కుమారుడు లూకాస్ గుర్తించాడని డాన్ కార్న్స్ తెలిపారు. మన ఇంటి ఆస్తి పత్రాలు చాలా కాలం తరువాత దొరికితే ఎలా భయంకరంగా ఉంటాయో ఈ ప్రేమ లేఖ కూడా అలాగే ఉందని ఆమె చెప్పారు. పగిలిపోయిన టైల్స్ లో దొరికిన ప్రేమ లేఖను వారు చదవలేకపోయారు. దీన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో చాలా మంది సాయంతో దీన్ని చదవగలిగారు.

Jobs In ESIC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్‌ఐసీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..


ప్రేమ లేఖలో ఏముందంటే
‘‘నా ప్రియాతి ప్రియతమా, ప్రతి ఉదయం నన్ను నువ్వు చూడటానికి వచ్చేందుకు ప్రయత్నిస్తావా? ఈ ప్రేమ మన ఇద్దరి మధ్యే రహస్యంగా ఉండాలి. ఎందుకంటే నీకు ఇప్పటికే పెళ్లి అయింది కదా.. అది వేరే సమస్యలు తీసుకువస్తుందేమో. నువ్వు నన్ను కలువు అని ప్రతిరోజూ అనొద్దు, కానీ కలుసుకోవాలనుకుంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్ధరాత్రి కలుద్దాం. త్వరలో మళ్లీ కలుద్దాం. ఇట్లు.. నీ ముద్దల ప్రియుడు రోనాల్డ్’’ అని ఈ వింటేజ్ లవ్ లెటర్‌లో రాసి ఉంది.

100 ఏళ్ల నాటి లవ్ లెటర్


ప్రేమలేఖలో ప్రియురాలిని వర్ణించిన తీరు చూసి డాన్, లూకాస్ అబ్బురపడ్డారు. ప్రేమ లేఖపై ఎలాంటి తేదీ లేదు. అయితే ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడం వల్ల.. దీన్ని 1920 కంటే ముందుగా రాసి ఉంటారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వారు ఉంటున్న ఇంటిని 1917లో నిర్మించారు. దీన్ని బట్టి ఈ లేఖ రాసి వంద సంవత్సరాలపైనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Indian Railway Jobs: పది పాసైన అభ్యర్థులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..


నెటిజన్లు ఈ అమరప్రేమికుడు డోనాల్డ్ చరిత్ర గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. దీనిపై నెటిజన్లు అనేక కామెంట్లు చేశారు. మీ ఇల్లు ఓ అద్భుతమైన చరిత్రను దాచి పెట్టిందని ఒకరు, ఇది నాకు ఎంతో నచ్చిన పోస్ట్, ఇది మధురమైన ఆవిష్కరణ అంటూ మరొకరు కామెంట్లతో ముంచెత్తారు. ఈ ప్రేమ లేఖను ఫ్రేమ్ కట్టించి మెమొంటోగా గోడకు అలంకరిస్తామని డాన్ వెల్లడించారు.
Published by:Veera Babu
First published: