Home /News /trending /

114 ఏళ్ల నాటి ఇల్లు.. అక్కడ భార్య చిన్నతనం.. దాన్ని కొన్న భర్త.. శుభ్రం చేస్తుంటే ఏం జరిగిందంటే..

114 ఏళ్ల నాటి ఇల్లు.. అక్కడ భార్య చిన్నతనం.. దాన్ని కొన్న భర్త.. శుభ్రం చేస్తుంటే ఏం జరిగిందంటే..

(Image Credit: Mirror.co.uk)

(Image Credit: Mirror.co.uk)

ఈ భ‌ర్త చేసిన ప‌నిని నెటిజ‌న్లు `శ‌భాష్` అంటూ మెచ్చ‌ుకుంటున్నారు. ముందు చాలా మంది `నువ్వు చేస్తుంది పిచ్చిప‌ని` అని హేళ‌న చేసినా..., ఇప్పుడ‌ ఎంతో మంది `నువ్వే మాకు స్ఫూర్తి అంటూ అత‌ణ్ణి పొగిడేస్తున్నారు.

ఈ భ‌ర్త చేసిన ప‌నిని నెటిజ‌న్లు `శ‌భాష్` అంటూ మెచ్చ‌ుకుంటున్నారు. ముందు చాలా మంది `నువ్వు చేస్తుంది పిచ్చిప‌ని` అని హేళ‌న చేసినా..., ఇప్పుడ‌ ఎంతో మంది `నువ్వే మాకు స్ఫూర్తి అంటూ అత‌ణ్ణి పొగిడేస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న చేసిన ప‌ని ఏమై ఉంటుంద‌బ్బా!? అనుకుంటున్నారా...

ఆడ‌మ్ మిల్ల‌ర్ త‌న భార్య కోసం 114 ఏళ్ల‌నాటి ఒక పాత‌కాల‌పు ఇంటిని కొన్నాడు. ఎందుకంటే, ఈ ఇంటిలోనే త‌న భార్య చిన్న‌త‌నం గ‌డిపింది. ఆమెకు ఆ ఇల్లు అంటే ఎంతో ఇష్టం కూడా. అందుకే త‌న భార్య క‌ల నిజం చేయ‌డానికి ఆ ఇంటిని కొన్నాడు. అంత‌టితో అయిపోలేదు... ఆడ‌మ్ తీసుకున్న శ్ర‌మంతా ఆ త‌ర్వాతే మొద‌లయ్యింది. ఏకంగా తొమ్మిది నెల‌ల పాటు శ్ర‌మించి, తుఫానుకు ఎదురొడ్డి నిల‌బ‌డి ప‌నిచేశాడు. బాగా పాడైపోయిన ఆ ఇంటికి స‌జీవ రూపాన్నిచ్చి అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకుంటున్నాడు. న‌లుగురు పిల్ల‌లున్న ఆడ‌మ్ ఈ ఇంటిని ఎంతో శ్ర‌ద్ద‌గా బాగు చేశాడు. అద్భుత‌మైన ఈ ప‌నిత‌నాన్ని విడ‌త‌ల వారీగా త‌న వైర‌ల్ టిక్ టాక్ క్లిప్స్ (Viral Tik Tok Clips) ‌లో ఉంచాడు.

ఆ ఇల్లు అంత‌కు ముందు ఎంత అందంగా ఉండేదో, ఎంత నీట్‌గా స‌ర్థి ఉండేదో ఆ ఒరిజినాలిటీనీ ఏ మాత్రం త‌గ్గించ‌కుండా సుంద‌ర భ‌వ‌నంగా తీర్చిదిద్దాడు. ఆడ‌మ్ వ‌య‌సు 36 సంవ‌త్స‌రాలు. అత‌ని భార్య‌కు 32 సంవ‌త్స‌రాలు. క‌రోనా విజృంభిస్తున్న గ‌తేడాది జూన్ నెల‌లోనే 380 వేల‌ పౌండ్లు పెట్టి ఈ ఇంటిని కొన్నాడు. అప్ప‌టి నుంచీ పాడైన ఆ ఇంటిని బాగు చేస్తూనే ఉన్నాడు. ఆడ‌మ్ వృత్తిప‌రంగా వ్యాపార‌వేత్త‌. సొంతగా వ్యాపారం చేస్తున్నాడు. అలాంటిది త‌న భార్య కోసం త‌న ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటూనే ఇంటిని బాగుచేయ‌డంలో ఎంతో శ్ర‌మించాడు. ఫ్లోర్ బోర్డులు తీసేయ‌డం, పాడైన గోడ‌ల‌ను ప‌గ‌ల‌గొట్ట‌డం లాంటి ప‌నుల‌న్నీ ద‌గ్గ‌రుండి చూసుకొని ఆ భ‌వ‌నం మొత్తాన్నీ స‌రికొత్త‌గా తీర్చిదిద్దాడు. ఈ ప‌ని మొత్తానికీ మ‌రో 217 వేల పౌండ్లు అవుతుంద‌ని ముందుగానే అంచ‌నా వేసుకున్నాడు. అయితే ఇంత ప‌ని భారాన్ని మోయ‌డంలో, ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని భ‌వ‌నాన్ని కొనుక్కోని మ‌రీ బాగుచేసుకోవ‌డంలో ఏ మాత్రం సంకోచం లేద‌ని అంటాడు ఆడ‌మ్‌.

తొమ్మిది నెల‌ల ఆడ‌మ్ శ్ర‌మ త‌ర్వాత త‌న భార్య డ్రీమ్ హోమ్ (Dream Home) న‌మ్మ‌శ‌క్యం కాని విధంగా మారిపోయింది. ఎంతో అద్భుతంగా త‌యారై, ఏ కుటుంబ‌మైన తాము నివసించాలని కోరుకునే అద్భుతమైన ఇంటిలా క‌నిపించింది. నిజానికి ఆడ‌మ్ తుఫాను వ‌ల్ల చాలా వ‌ర‌కూ పాడైపోయిన ఇంటి క‌ప్పుతో పెద్ద ఫైటింగ్ చేశాడ‌నే చెప్పాలి. అందుకే ఇక్క‌డ బాగు చేసిన ప్ర‌తి విష‌యాన్నీ చ‌క్క‌గా రికార్డు చేసి, తన టిక్‌టాక్ పేజీలో ఉంచాడు.

దీనిపై ఆడ‌మ్ మాట్లాడుతూ...`నా వ్యాపారాన్ని చూసుకుంటూ ఇంటిని బాగు చేయ‌డం కోసం మ‌రింత ఎక్కువ‌గా దృష్టి పెట్టాల్సి వ‌చ్చింది. అయితే బ‌య‌టి ప్ర‌పంచం గురించి ఆలోచించ‌కుండా దీన్ని పూర్తి చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ ఇంట్లో మా కుటుంబంతో క‌లిసి త‌ర‌త‌రాలుగా ఉండిపోవాల‌ని కోరుకుంటున్నాము` అంటూ తన సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. `ఆన్‌లైన్‌లో మా ఇంటికి ప్ర‌పంచంలో అంద‌ర్నీ ఆహ్వానించాము. నిజంగా ఇది న‌మ్మ‌లేక‌పోతున్నాము. అంత‌కుమించి, ప‌రిచ‌యంలేని వాళ్లు మా ఇంటి గురించి మాట్లాడ‌టం ఎంతో అద్భుతంగా ఉంది` అంటున్నారు ఆ కుటుంబ స‌భ్యులు.

నిజ‌మే కొత్త‌కొత్త వుడెన్ బానిస్ట‌ర్లు, స‌రికొత్త‌ గోడ‌ల‌తో పూర్వ‌పు అందాల‌తో ఇప్పుడు ఆ అద్భుతమైన భవనం మెరిసిపోతోంది. ఆడ‌మ్ భార్య జెస్సికా మాట్లాడుతూ... ` మేము ఈ ఇల్లు చెప్పిన‌ట్లు చేశాము. దాన్ని మేము విన్నాము. దానికి జీవితాన్ని ఇచ్చాము. నిజానికి ఈ ఇంటికి ఆ క్యారెక్ట‌ర్ అవ‌స‌రం. ఇది మేము మాత్ర‌మే దాచుకునే మా క‌థ మాత్రం కాదు. మా త‌ర‌వాత త‌రాల కుటుంబాలంద‌రి క‌థ‌గా మిగిలిపోవాలి` అంటారు. ఆన్‌లైన్‌లో ఈ ప్రాజెక్ట్ సంచ‌ల‌నంగా మారింది. ఆడ‌మ్ డిఐవై వీడియోల‌న్నీ కలిసి 19 మిలియ‌న్ల వ్యూస్ అందుకున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: United Kingdom, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు