అక్కడ వారానికి నాలుగు రోజులే పని దినాలు.. అదృష్టవంతులంటే వాళ్లే..

Trending News: బ్రిటన్‌ ఉద్యోగులు అత్యంత అదృష్టవంతులనే అనుకోవాలి. మనం ఒక్క రోజు సెలవు కోసమే కష్టపడుతుంటే.. అక్కడ ఓ కంపెనీ వారానికి మూడు రోజులు సెలవు ఇస్తోంది. ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌కలిస్ అనే లీగల్ కంపెనీ తన ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాలనే కల్పిస్తోంది.

news18-telugu
Updated: May 27, 2019, 6:15 PM IST
అక్కడ వారానికి నాలుగు రోజులే పని దినాలు.. అదృష్టవంతులంటే వాళ్లే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారమంతా పనిచేస్తే ఒక్క రోజు సెలవు దొరుకుతుంది. కాస్త విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఏదైనా పని పడితే అది కూడా హుష్ కాకి. ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతోంది. మిగతావారంతా 6 రోజులు పని చేయాల్సిందే. కానీ, బ్రిటన్‌ ఉద్యోగులు అత్యంత అదృష్టవంతులనే అనుకోవాలి. మనం ఒక్క రోజు సెలవు కోసమే కష్టపడుతుంటే.. అక్కడ ఓ కంపెనీ వారానికి మూడు రోజులు సెలవు ఇస్తోంది. ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌కలిస్ అనే లీగల్ కంపెనీ తన ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాలనే కల్పిస్తోంది. జీతం తగ్గకుండా వారానికి ఓ రోజు అదనపు సెలవుదినం ఇస్తోంది. దీనిపై కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాలు కల్పించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుందని, అలసట తగ్గిపోతుంద’ని తెలిపారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తే తన ఉద్యోగులు గతంతో పోల్చితే చాలా ఆనందంగా ఉంటున్నారని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నమని వెల్లడించారు.

పనిదినాల కుదింపు ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ ఈ పద్ధతి అనుసరించి 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగా ఉంటోందట.
First published: May 27, 2019, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading