హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

రోడ్డు మీద తన కాళ్ల మీద తాను నిలబడలేక పోతున్న యువతి.. కారణం అదే.. వీడియ్ వైరల్..

రోడ్డు మీద తన కాళ్ల మీద తాను నిలబడలేక పోతున్న యువతి.. కారణం అదే.. వీడియ్ వైరల్..

మత్తులో తూలుతున్న యువతి

మత్తులో తూలుతున్న యువతి

Punjab: యువతి పూటుగా మద్యం సేవించింది. కనీసం అడుగు దాటి మరో అడుగు వేయలేకపోతుంది. ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

మనలో చాలా మంది మద్యానికి, మత్తుపదార్థాలకు బానిసవుతున్నారు. ఇప్పటికే అనేక రకాల మత్తు పదార్థాలు మార్కెట్ లో దొంగ చాటున విక్రయిస్తున్నారు. అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్న, దీనికి అడిక్ట్ అయిన వారు మాత్రం.. దాన్ని సేవించలేకుండా ఉండలేకపోతున్నారు. వైన్, గుట్కా, డ్రగ్స్ లను దొంగ చాటున తీసుకుంటుంటారు. మరికొందరు కల్లు, సారాయి, బీడీ,సిగరెట్ లను తీసుకుంటారు. ఇవి దొరక్కపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. వీటికి బానిసలుగా మారి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాగా, అనేక ప్రభుత్వాలు.. మత్తుపదార్థాల రాకెట్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికి అధికారులకు తెలియకుండా అనేక రకాలుగా వీరి దందా కొనసాగిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లో (Punjab) జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మక్బూల్ పురా ప్రాంతంలో ఒక యువతి మదక ద్రవ్యాలు తీసుకుని తూలుతూ రోడ్డుపైన వెళ్తుంది. ఆమె కనీసం నడలేక పోతుంది. ఆమె సిక్కు సామాజిక వర్గానికి చెందిన యువతిగా తెలుస్తోంది. సిక్కుల మతాచారం ప్రకారం.. మద్యం సేవించటం నిషేధం. కానీ యువతి.. ఇలా బహిరంగంగా మద్యం సేవించి, తూలుతుండటం తీవ్రచర్చనీయాంశంగా మారింది.

దీంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో మద్యం, మత్తుపదార్థాల రవాణా అధికరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అదే విధంగా, చాటు మాటున అక్కడ మత్తుపదార్థాల దందా కొనసాగుతుందని అధికారులు విచారణలో తెలింది. దీనిపై అపోసిషన్ పార్టీలు తీవ్రంగా తమ నిరసన తెలియజేస్తున్నాయి. అయితే.. ఇది ఆప్ ఎమ్మెల్యే జీవన్ జ్యోత్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మక్బూల్‌పురా ప్రాంతంలో ఈ వీడియో తీయబడింది.

మక్బూల్‌పురా ప్రాంతం పెద్ద సంఖ్యలో మాదకద్రవ్యాలకు బానిసలుగా పేరుగాంచింది. దీనిపై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుతున్నారు. భగవంత్ మాన్ పంజాబ్ సీఎం కాగానే.. అక్కడ మాదకద్రవ్యాలను లేకుండా చేస్తానని హమీ ఇచ్చారని, నాషా ముక్త్ అన్నారని, ఇదేంటనీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Drinking wine, Punjab, Viral Video

ఉత్తమ కథలు