Smart Insulin Patch : స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచ్... డయాబెటిస్‌ రోగులకు వరం?

Smart Insulin Patch : డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి పరిశోధకులు సరికొత్త స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచ్ తయారుచేశారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.


Updated: February 7, 2020, 11:47 AM IST
Smart Insulin Patch : స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచ్... డయాబెటిస్‌ రోగులకు వరం?
Smart Insulin Patch : స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచ్... డయాబెటిస్‌ రోగులకు వరం? (credit - twitter - tali)
  • Share this:
Smart Insulin Patch : డయాబెటిస్ సమస్య ఉన్నవారికి అతి పెద్ద సవాలు ఇన్సులిన్. అలాగే... బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఎప్పటికప్పుడు క్రమపద్ధతిలో ఉండేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదో తలనొప్పి వ్యవహారం. మాటిమాటికీ ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్‌ను బాడీలోకి ఎక్కించుకోవడం కూడా పెయిన్‌తో కూడుకున్న అంశం. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ... UCLA, UNC, MIT పరిశోధకులు... కాయిన్ సైజులో ఉండే స్మార్ట్ ఇన్సులిన్ ప్యాచ్ (Smart Insulin Patch) తయారుచేసి... దాన్ని విజయవంతంగా పరీక్షించి చూశారు. ఈ ప్యాచ్ ఎంత మంచిదంటే... ఇది డయాబెటిస్ సమస్యతో బాధపడేవారి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్‌ని మేనేజ్ చేస్తూ... ఎప్పటికప్పుడు అవి క్రమపద్ధతిలో ఉండేలా చూస్తుంది. అంతేకాదు.. కావాల్సినంత ఇన్సులిన్‌ను వెంటనే అందిస్తూ... జాగ్రత్తగా చూసుకుంటుంది అని పరిశోధకులు తెలిపారు.

ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఈ ప్యాచ్ తయారీ చాలా తేలిక. అలాగే డయాబెటిస్ పేషెంట్లకు దీన్ని వాడటం కూడా తేలికే. ఈ పరీక్షలకు సంబంధించిన వివరాల్ని నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ మేగజైన్‌లో తెలిపారు. ప్రస్తుతానికి ఈ పరీక్షలను ముందుగా చుంచెలుకలు (Mice), పందులపై చెయ్యగా విజయవంతం అయ్యాయి. త్వరలో మనుషులపైనా క్లినికల్ ట్రయల్స్ చేసి... అప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యనున్నారు. 2015 నుంచీ ఈ పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఇవి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్యాచ్ గనక అమల్లోకి వస్తే... అప్పుడు డయాబెటిస్ పేషెంట్లకు చాలా ఉపశమనం కలుగుతుంది అంటున్నారు డాక్టర్లు.

డయాబెటిస్ సమస్య తగ్గాలంటే... దానికి సరైన మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడం అలాగే బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ క్రమంగా ఉండేలా చేసుకోవడం. ప్రస్తుతానికి చాలా మంది పేషెంట్లు ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా తగ్గాల్సిన డయాబెటిస్ కాస్తా ఎక్కువై ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ ప్యాచ్ వల్ల... షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి... ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశాలుంటాయి. తద్వారా క్రమంగా రోగులు కోలుకునేందుకు వీలవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ చిన్న ప్యాచ్‌లో ముందుగానే ఇన్సులిన్ లోడ్ చేసి ఉంచుతారు. ఇందులో టైనీ మైక్రో నీడిల్స్ ఉంటాయి. ఒక్కోటీ 1 మిల్లీమీటర్ కంటే చిన్నగా ఉంటుంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పగానే... ఈ మైక్రో నీడిల్స్ నుంచీ ఇన్సులిన్ వెంటనే బాడీలోకి వెళ్తుంది. బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌కి చేరుకుంటున్న సమయంలో... మైక్రో నీడిల్స్ నుంచీ ఇన్సులిన్ సరఫరా కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఇంజెక్షన్ల ద్వారా ఒక్కోసారి కావాల్సిన దాని కంటే ఎక్కువ ఇన్సులిన్ బాడీలోకి పంపించుకుంటుండటం వల్ల... హైపోగ్లిసెమియా, సిజర్స్, కోమాలోకి వెళ్లడమే కాదు... ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తోంది. అదే ఈ ప్యాచ్ ఉంటే... ఎక్కువ ఇన్సులిన్ బాడీలోకి వెళ్లే సమస్యే ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రకాల సమస్యల్లోనూ ఇన్సులిన్ బాడీకి అవసరమే. పందికి ఒకసారి తగిలించిన ప్యాచ్.. 20 గంటలవరకూ పనిచేసింది. ఆ లెక్కను మనిషికి అది 10 గంటల వరకూ పనిచేసే అవకాశాలున్నాయని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు, పరీక్షలు విజయవంతమై... ఈ డయాబెటిస్ సమస్య అన్నది తొలగిపోతే... ఎంతో ఆనందకరమే. అలా జరగాలని కోరుకుందాం.
First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు