హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: ఇదేక్కడి రచ్చరా బాబు.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే భారీ జరిమాన.. కారణం ఏంటంటే..

Shocking: ఇదేక్కడి రచ్చరా బాబు.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే భారీ జరిమాన.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UAE: మనం సాధారణంగా ఇళ్లలో బంగ్లా మీద లేదా పెరడులో బట్టలు ఆరేస్తుంటాం. ఇక నగరాలలో కావాల్సినంత స్థలం ఉండదు కాబట్టి వారు.. అక్కడ బాల్కనీలలో, టెర్రస్ లు, గోడ పక్కన కొక్కెలు బిగించి అక్కడ బట్టలు ఆరేస్తుంటారు. 

UAE Residents warned against drying clothes on balconies: మన ఇళ్లలో చాలా మట్టుకు మన బట్టలను మనమే ఉతుక్కుంటాం. ఇక కొందరి ఇళ్లలో మాత్రం పనివాళ్లు.. వాషింగ్ మెషిన్లు ఉంటాయి. ఈ క్రమంలో వారు బట్టలను ఉతికిన తర్వాత.. బట్టలను పెరడులో కానీ, ఇంటి పక్కన గోడలకు దారం ఉంటుంది. అక్కడ బట్టలను ఆరేస్తుంటారు. ఇక నగరాలలో, పట్టణాలలో అలాంటి ఖాళీ స్థలం ఉండదు.

కానీ కొన్ని చోట్ల బాల్కనీ లు ఉంటాయి. అక్కడ ప్రజలు ఆ స్థలాలలో తమ ఉతికిన బట్టలను ఆరేయడానికి వినియోగించుకుంటారు. అయితే, యూఎఈలోని అబూదాబి నగరం కొత్త ఆదేశాలు జారీచేసింది. ఇక మీదట ప్రజలు ఎవరు కూడా బాల్కనీలో బట్టలు ఆరేయరాదని ఆదేశించింది.

పూర్తి వివరాలు.. యూఏఈ మున్సిపాలిటీ అధికారులు వింత ఆదేశాలను జారీచేశారు. అబూదాబిలో సాధారణంగా ప్రజలు తమ బాల్కనీలలో తరచుగా బట్టలను ఆరేస్తుంటారు. దీనిపై మున్సిపాలిటీ అధికారులు పలు విషయాలు వెల్లడించారు. ఇలా ఇష్టమోచ్చినట్లు బట్టలు ఆరేయడం వలన నగరం అందం దెబ్బతింటుందని, పర్యటకులు దీనికి ఇబ్బందికరంగా భావిస్తున్నారని తెలిపింది.

ఇక మీదట  బాల్కనీలు, టెర్రస్ లో బట్టలు ఆరేయకూడదని హెచ్చరికలను జారీచేసింది. ఒక వేళ.. బాల్కనీలలో బట్టలు ఆరబెట్టడితే 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ. 20,000 భారతీయ) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని అధికారులు చెప్పారు. ఇక బట్టలు ఆరేసేందుకు.. లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకే ఈ విషయంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబుదాబీ మున్సిపల్ అధికారులు సూచించారు.

First published:

Tags: UAE, VIRAL NEWS, Wearing clothes