HOME »NEWS »TRENDING »tyre blast video goes viral on social media sk

Viral Video: బాంబులా పేలిన టైర్.. ఇంత బీభత్సమా.. లైవ్‌లో చూడండి..

Viral Video: బాంబులా పేలిన టైర్.. ఇంత బీభత్సమా.. లైవ్‌లో చూడండి..
టైర్ బ్లాస్ట్ వీడియో

వీడియో చూసిన వారంతా.. షాక్‌కు గురయ్యారు. టైర్ పేలితే ఇంత బీభత్సంగా ఉంటుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. టైర్‌లో గాలి కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

  • Share this:
    వాహనాలుంటే వాటి టైర్లకు పంక్చర్లు కామన్. రోడ్డుపై వెళ్తుంటే ఎప్పుడు ఏం గుచ్చుతుందో తెలియదు. ఎప్పుడు గాలిపోతుందో తెలియదు. సైకిల్‌‌లు, బైక్‌లు వంటి చిన్న వెహికిల్స్ పంక్చర్‌లు అయితే నేరుగా తీసుకెళ్లి రిపేర్ చేయిస్తాం. కానీ బస్సులు, లారీలు, ట్రాక్టర్ల టైర్లు పంక్చర్‌లు అయితే టైర్‌లు విప్పుకొని పంక్చర్ కొట్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఐతే టైర్‌లో గాలికొట్టే సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. లైట్‌గా తీసుకుంటారు. కానీ ఆ చిన్న అజాగ్రత్తే ప్రమాదానికి దారితీస్తుంది. ప్రాణాల మీదకు తెస్తుంది. ఎక్కువగా గాలి కొడితై టైర్ బాంబులా మారి పేలుతుంది. ఓ టైర్ బాంబులా పేలిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేలుతున్న ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.




    ఓ వ్యక్తి టైర్‌కు పంక్చర్ వేయించేందుకు దుకాణానికి వెళ్లాడు. పంక్చర్ వేసిన తర్వాత గాలికొట్టారు. ఒకరు టైర్ కాలుపెట్టి నిలబడగా.. మరొకరు గాలి నింపారు. ఐతే గాలి కొట్టే వ్యక్తి అజాగ్రత్తగా ఉండి.. ఎక్కువగా గాలి నింపడం వల్ల టైర్ పేలిపోయింది. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి టైర్‌పై కాలుపెట్టిన వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. ఈ వీడియో చూసిన వారంతా.. షాక్‌కు గురయ్యారు. టైర్ పేలితే ఇంత బీభత్సంగా ఉంటుందా అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. టైర్‌లో గాలి కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:December 30, 2020, 06:34 IST