Interesting: గూగుల్ ఇమేజెస్ లో 241543903 అని టైప్ చేయండి.. ఆ తర్వాత జరిగే తమాషా మీరే చూడండి..

Image credit : twitter

Interesting: ప్రపంచంలో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. మనకు తెలియనిది తెలుసకున్నప్పుడు వింతగా అనిపిస్తుంటుంది. ఇంకా ఎన్నో తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం చెప్పుకునే ఓ విషయం కూడా దాదాపు అలాంటిదే. అదేంటో తెలుసుకుందాం..

 • Share this:
  ఇంటర్నెట్(Internet) వాడకం దశాబ్ధకాలం నుంచి విపరీతంగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే(Smart Phones) కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నోకియా(Nokia)లో చిన్న మొబైల్(Mobile) వాటిన జనాలు ప్రస్తుతం టచ్ లేని ఫోన్లను దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ఇంటర్నెట్ వాడకం కూడా అంతకు అంత పెరిగిపోయింది. ఏ చిన్న విషయం తెలిసినా వెంటనే తమ తమ సోషల్ మీడియా(Social Media)లో అప్ లోడ్(Upload) చేస్తుంటారు. ఏదైనా తెలుసుకోవాలని అనుకున్నా వెంటనే గూగుల్(Google) లో వెతికేస్తుంటారు. అయితే మనకు కావాల్సిన సమాచారం కావాలంటే ముందుగా మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

  Funny Incident: ఏ బ్రాండ్ మద్యం తాగావ్ నాయనా.. పోలీసులకే చుక్కలు చూపించావ్ గా..


  తర్వాత మనం ఏం వెతుకుతున్నామో ఒక ఐడియా ఉంటే.. వెంటనే గూగుల్ లోకి వెళ్లి ఆ కీ వర్డ్స్ ను ఎంటర్(Enter) చేస్తున్నాం. అయితే కేవలం గూగుల్ లో మాత్రమే ఎందుకు ఎంటర్ చేయాలి.. అలాంటి ప్లాట్ ఫాంలు లేవా అంటే.. ఉన్నాయి. బింగ్ అని, యాహూ అని ఇలా సెర్చ్ ఇంజన్ లు ఉన్నాయి. కానీ గూగుల్ ఇచ్చే ఇన్ ఫర్ మేషన్ అవి ఇవ్వవు అని.. గూగుల్ లో వెతికితే ఏదైనా సమాచారం దొరికిందంటే.. అదే జెన్యూన్ అని మొదటి నుంచి నమ్ముకుంటూ వస్తున్నారు నెటిజన్లు.

  New Smart Phone: ఇండియాలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..


  అందుకే ప్రస్తుతం గూగుల్ కి అంత పాపులారిటీ పెరిగింది. అయితే గూగుల్ కి అటాచ్ అయి చాలా ఉన్నాయి. గూగుల్ మెయిల్, ఫొటోలు, డ్రైవ్ మరెన్నో ఉన్నాయి. కొంతమంది తమకు కావాల్సిన ముఖ్యమైన ఫొటోలను తమ గూగుల్ ఫొటోస్ లో అప్ లోడ్ చేస్తుంటారు. ఇలా ఓ వ్యక్తి అప్ లోడ్ చేసిన ఫొటో ను గూగుల్ ఇమేజ్ లోకి వెళ్లి 241543903 అని టైప్ చేస్తే అందులో ఒక విచిత్రమైన సీక్వెన్స్ ను మనం చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  Video Viral: అమ్మాయి ఒడిలో నిద్రపోతున్న భారీ కొండ చిలువ.. ఆ వీడియోను మీరూ చూడండి..


  ఇలా గూగుల్ ఇమేజ్ లోకి వెళ్లి 241543903 అని టైప్‌ చేసి ఎంటర్‌ ప్రెస్‌ చేస్తే.. అన్నీ దాదాపుగా ఒకేలాంటి ఇమేజెస్‌ వస్తాయి. అందరూ ఫ్రిజ్ లో తలపెట్టి ఉండే ఫొటోలు ఉంటాయి. ఎందుకు ఇలా అంటే దానికి సంబంధించిన విశేషం కూడా ఒకటి ఉంది. ముందు ఆ కథేంటో తెలుసుకుందాం..

  2009 సంవత్సరంలో డేవిడ్ హీర్వట్జ్ అనే వ్యక్తి ఒక ఫ్రిడ్జ్ ను కొన్నాడు. తాను కొన్న ఫ్రిడ్జ్ ను ఫొటో తీసుకోవాలని అనుకున్నాడు. ఫ్రిజ్ లో తల పెట్టి ఫోటో తీసుకున్నాడు. దానిని టంబ్లర్ అనే సోషల్ మీడియా సైట్ లో పోస్టు చేశాడు. అప్పుడు ఆ ఫొటోకు అతడు 241543903 అనే టైటిల్ పెట్టాడు. అయితే ఆ సంవత్సర కాలంలో ఆర్క్యూట్ (Orkut) అనే సోషల్ మీడియా సైట్ ఉండేది.

  Alcohol Museum: ఆ మ్యూజియం మొత్తం ఆల్కహాలే.. ఎక్కడ లాంచ్ చేశారో తెలుసా..


  అందులో చాలామంది యాక్టివ్ గా ఉండేవారు. అందులో కొందరు ఇలాగే ఫొటోలు తీసి వాటికి కూడా ఇదే నంబర్ ను పెట్టి పోస్ట్ చేశారు. ఇలా ఎంతో మంది ఫొటోలు దిగి అదే నంబర్ ను టైటిల్ గా పెట్టారు. దీంతో ఆ నంబర్ ను గూగుల్ ఇమేజేస్ లో టైప్ చేస్తే ఫ్రిజ్ లో తలపెట్టిన ఫొటోలు మాత్రమే వస్తున్నాయి. ఇలా చాలా రోజుల వరకు చాలామంది ఇలానే చేశారు. దీంతో గూగుల్ లో ఆ నంబర్ అలా సేవ్ అయిపోయింది. దీని వెనకాల ఉన్న అసలైన కారణం ఇదే.
  Published by:Veera Babu
  First published: